SP Sudhir Ramnath Kekan: అమరుల త్యాగాలు చిరస్మరణీయం
SP Sudhir Ramnath Kekan (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

SP Sudhir Ramnath Kekan: పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్

SP Sudhir Ramnath Kekan: విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్(SP Sudhir Ramnath Kekan: పేర్కొన్నారు. మంగళవారం అమరవీరుల సంస్కరణ దినోత్సవ సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వేడుకలు నిర్వహించారు. ప్రజలకు సేవలు అందించడమే ధ్యేయంగా విధి నిర్వహణలో ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన పోలీస్ అమరవీరులకు ప్రతి ఒక్కరి పేరు చదువుతూ జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటున్నామని తెలిపారు.

అసువులుబాసిన పోలీసుల..

భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచిందన్నారు. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైందన్నారు. మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవని, సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు నిర్వర్తించేవని తెలిపారు.

Also Read; Ponnam Prabhakar: అసెంబ్లీలో ఓకే చెప్పి.. పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తున్నారు.. బీజేపీపై మంత్రి పొన్నం ఫైర్

పది మంది భారత జవాన్లు

1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడిందని గుర్తు చేశారు. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారని వివరించారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటిబుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్రస్థలంగా రూపు దిద్దుకుందన్నారు. ప్రతి ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిఎస్పి ఎన్ తిరుపతిరావు, ఏఆర్డిఎస్పీలు, ఏ ఆర్ ఆర్ ఐ లు, వివిధ పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: Bigg Boss Telugu 9: నువ్వు, నీ ఓవరాక్షన్, నీ లవ్ యవ్వారాలు నాకు నచ్చలే.. రీతూకి షాకిచ్చిన ఆయేషా!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..