OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొస్తూ, ‘ఓజీ’ సినిమా (OG Movie) నుంచి ‘గన్స్ అండ్ రోజెస్’ (Guns and Roses) ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా అక్టోబర్ 23వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, మేకర్స్ విడుదల చేసిన ఈ వీడియో సాంగ్ ఇప్పుడు నెట్టింట్లో బీభత్సం సృష్టిస్తోంది. ఈ సినిమా విజయంలో ఎస్.ఎస్. థమన్ (SS Thaman) అందించిన నేపథ్య సంగీతం (BGM) ఎంత కీలక పాత్ర పోషించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ‘గన్స్ అండ్ రోజెస్’ పాటలో థమన్ మార్క్ BGM ర్యాంప్ ఆడించేసిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను చూసినప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ పాట, ఇప్పుడు పూర్తి వీడియో రూపంలో అందుబాటులోకి రావడంతో.. పవన్ కళ్యాణ్ స్టైల్, థమన్ ఎనర్జీ కలిసి వీక్షకులకు ట్రీట్‌లా మారింది.
Also Read- Anaganaga Oka Raju: పటాకాయల షాప్‌లో పట్టు చీరలు దొరుకుతాయా.. ‘అనగనగా ఒక రాజు’ దీవాళి బ్లాస్ట్!
ఓటీటీ రిలీజ్‌పై హైప్ పెంచేస్తున్నాయ్..
థియేటర్లలో అద్భుతమైన విజయం సాధించిన ‘ఓజీ’ చిత్రాన్ని అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో (OG Netflix release) చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, మేకర్స్ వీడియో సాంగ్స్‌ను విడుదల చేయడం అనేది ఓటీటీ ప్రేక్షకుల్లో హైప్‌ను పెంచడానికి ఒక తెలివైన మార్కెటింగ్ వ్యూహంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన ‘హంగ్రీ చీతా’ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుండగా, ఇప్పుడు వచ్చిన ‘గన్స్ అండ్ రోజెస్’ ఫుల్ వీడియో సాంగ్ కూడా అదే దూకుడును కొనసాగిస్తోంది.
మిస్ అయిన వారికి గోల్డెన్ ఛాన్స్
ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయిన వారికి, మళ్లీ చూడాలని అనుకుంటున్న వారికి నెట్‌ఫ్లిక్స్ విడుదల ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, స్టైలిష్ టేకింగ్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ వంటి అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వీడియో సాంగ్స్ ప్రేక్షకులలో ఆ ఉత్సాహాన్ని తిరిగి తీసుకువస్తున్నాయి. ‘గన్స్ అండ్ రోజెస్’ సాంగ్‌లోని విజువల్స్, థమన్ మ్యూజిక్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్‌గా నిలుస్తున్నాయి.
Also Read- Chiranjeevi: చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ దీవాళి విషెస్ పోస్టర్ చూశారా?
ఓటీటీలో కొత్త రికార్డులు ఖాయం
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో సాంగ్స్‌కు వస్తున్న ఆదరణ, రెస్పాన్స్ చూస్తుంటే, ‘ఓజీ’ ఓటీటీలో కూడా విశేష ఆదరణ చూరగొనడం ఖాయంగా కనిపిస్తోంది. థియేటర్లలో రికార్డుల మోత మోగించిన ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ పరంగా కూడా సరి కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవరాల్‌గా, ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ఫుల్ వీడియో సాంగ్స్‌తో ఓటీటీ ప్రేక్షకులకు సినిమా పట్ల ఉన్న ఆసక్తి మరింత పెరిగేలా చేస్తున్నారనేలా అయితే టాక్ నడుస్తుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
