Anaganaga Oka Raju: నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty).. ఈ జాతిరత్నం టాలీవుడ్ ప్రేక్షకులందరికీ పరిచయమే. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ రాబోయే సంక్రాంతికి రాబోతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి దీపావళిని పురస్కరించుకుని ప్రత్యేక ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. దీపావళి వైబ్‌తో వచ్చిన ఈ ప్రోమో.. నవ్వుల టపాసులను తలపిస్తోంది. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2026 సంక్రాంతికి ప్రేక్షకులకు నవ్వులతో నిండిన అసలైన పండుగకు హామీ ఇచ్చేలా ఈ ప్రోమో ఉందంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. (Anaganaga Oka Raju Diwali Special Promo)
Also Read- Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ మూవీ 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
పంచులే పంచ్‌లు
ఈ ప్రోమోని గమనిస్తే.. ‘30 షార్ట్స్ ఏడబెట్టిర్రా’ అంటూ నవీన్ ఓ పటాకుల షాపు ఓనర్‌గా కనిపించారు. హ్యాపీ దీవాళి అన్న.. ఏం కావాలో చెప్పు? అని అనగానే.. ఏమేం దొరుకుతాయ్ అని ఎదుటి వ్యక్తి అడగగానే.. ‘పట్టు చీరలు, సిల్క్ శారీస్ అన్నీ ఉన్నాయ్ మనకాడ..’ అని పంచ్ పేల్చాడు నవీన్. ‘లేకపోతే.. పటాకాయల షాప్‌కి వచ్చి.. పట్టు చీరలు దొరుకుతాయా? అన్నా’ అని మరో పంచ్. రాజా రాకెట్స్ షాపుని పరిచయం చేసిన నవీన్.. ఎలాన్ మస్క్ పంచ్, లాస్ట్ టైమ్ తీసుకెళ్లినవి పేలలేదా అంటూ.. మీరేమన్నా టెర్రరిస్టులా? అంటూ మరో పంచ్, నాగ వంశీ పంచ్, మోదీ పంచ్, మీనాక్షి పంచ్, బబ్లూ పంచ్.. ఇలా పంచులతో ప్రోమోని అల్లాడించిన నవీన్.. ఫైనల్‌గా అన్నీ ఒకదానిలో కావాలంటావ్ మరీ.. అయితే ఇది తీసుకుపో అంటూ ‘అనగనగా ఒక రాజు’ని పటాస్‌పు రివీల్ చేశాడు. ‘ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్లాస్ట్ ఐటమ్ ఇది. మా బెస్ట్ సెల్లీంగ్ పీస్ ఇది. దీనిలో మీకు అన్నీ ఉంటాయి. ఈ దీవాళికి ఎలిగించారనుకో.. సంక్రాంతి పండుగ వరకు పేలుతూనే ఉంటుంది. పాటలు, టీజర్, ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు, ట్రైలర్.. రచ్చ రచ్చగా ఉంటది మరి. హ్యాపీ దీవాలి.. సంక్రాంతి పండుగకు కలుద్దాం’’ అంటూ నవీన్ ర్యాంప్ ఆడించాడు. మొత్తంగా అయితే ఈ ప్రోమో ఈ ఫెస్టివల్ వైబ్‌కు బాగా రీచ్ అయ్యేలా డిజైన్ చేశారు.
Also Read- Yellamma Movie: ‘ఎల్లమ్మ’ సినిమాపై ఎందుకింత కన్ఫ్యూజన్?
సంక్రాంతికి నవ్వుల అల్లరి
నవీన్ తనదైన టైమింగ్ పంచులు ప్రతి ఫ్రేమ్‌లో పేలాయి. తెరపై నవీన్ ఉత్సాహంగా కనిపించిన తీరు కట్టిపడేసింది. ఈ దీపావళి ప్రోమో వినోదాల విందులా ఉందని చెప్పొచ్చు. నవీన్ పొలిశెట్టి శైలి హాస్యాన్ని ప్రేక్షకులు ఎందుకు అంతలా ఇష్టపడతారో ఈ ప్రోమో మరోసారి తెలియజేస్తుంది. ఈ దీపావళి ప్రోమో, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయడమే కాకుండా.. సంక్రాంతికి నవ్వుల అల్లరి, వినోదాల విందులాంటి సినిమా రాబోతుందనే హింట్‌ని ఇవ్వడంలో సక్సెస్ అయింది. ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ.. ఈ భారీ అంచనాలున్న చిత్రం నుండి మొదటి గీతం త్వరలో విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
