Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 18 రోజుల్లో రూ. 765 కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా మేకర్స్ ప్రకటించడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రిషబ్ శెట్టి (Rishab Shetty) నటన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంది. మొదటి పార్ట్ ‘కాంతార’ (Kantara) సాధించిన విజయాన్ని మించి, ఈ ప్రీక్వెల్ మరింత వేగంగా, భారీ వసూళ్లను దక్కించుకుంది. అయితే, ఈ సినిమా రూ. 1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంటుందా? అనే ప్రశ్న ఇప్పుడు సినీ విశ్లేషకుల్లో, ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. (Kantara: Chapter 1 Movie Collections)
Also Read- Parineeti Chopra: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పరిణీతి చోప్రా.. ఇక సర్వస్వం వీడే అంటూ..!
విజయానికి కారణమిదే
‘కాంతార: చాప్టర్ 1’ విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని, కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్ర విజయానికి గల కారణాలను చెప్పుకుంటే.. దర్శకుడు రిషబ్ శెట్టి కథనాన్ని మలిచిన తీరుని ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రాంతీయ సంస్కృతులు, దైవారాధన, భూత కోల వంటి సంప్రదాయ అంశాలను బలంగా, ఉద్వేగభరితంగా చూపించడం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇది కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సహా ఇతర భాషల్లోనూ విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం సంచలన వసూళ్లు సాధించడం విశేషం. అయితే ఓవర్సీస్ మార్కెట్‌గా భారీ ధరకు హక్కులు అమ్ముడవడంతో.. అక్కడ బ్రేకీవెన్ కష్టమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read- Movie Collections: కావాలనే నిర్మాతలు కలెక్షన్స్ పెంచి చెబుతున్నారా? ప్రయోజనం ఏంటి?
వెయ్యి కోట్ల చేరువ సాధ్యమేనా?
18 రోజుల్లో రూ. 765 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అనేది అసాధారణమైన విషయం. అయితే, రూ. 1000 కోట్ల మార్క్‌ను చేరుకోవడానికి ఈ సినిమాకు ఇంకా దాదాపు రూ. 235 కోట్ల వసూళ్లు అవసరం. ఈ దశలో సినిమా వసూళ్లలో కొంత తగ్గుముఖం కనిపిస్తున్నప్పటికీ, రాబోయే పండుగలు, ముఖ్యంగా దీపావళి సెలవుల కారణంగా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, దేశవ్యాప్తంగా ఇతర భారీ బడ్జెట్ సినిమాలు కూడా పోటీలో ఉండటం, కొత్త సినిమాలు విడుదల కావడం ‘కాంతార చాప్టర్ 1’ వసూళ్ల వేగం కొంతమేరకు తగ్గిందనే చెప్పుకోవాలి. అయినా, ఈ చిత్రం ఇప్పటికే కన్నడ పరిశ్రమలో ‘KGF: చాప్టర్ 2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా, కేవలం 18 రోజుల్లో రూ. 765 కోట్ల మార్క్‌ను చేరుకోవడం అనేది చూస్తుంటే.. ఈ సినిమాపై ఉన్న ప్రేక్షకాదరణను, లాంగ్ రన్ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలిస్తే, ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం రూ. 1000 కోట్ల మార్క్‌ను అందుకోవడం కాస్త కష్టమైన లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ, పూర్తిగా అసాధ్యం కాదని చెప్పవచ్చు. ఈ దీవాళి పండుగ సెలవు దినాలలో వసూళ్లు భారీగా పుంజుకుంటే మాత్రం.. ‘KGF: చాప్టర్ 2’, ‘బాహుబలి 2’, ‘RRR’, ‘పుష్ప 2’ వంటి సినిమాల సరసన రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంటుంది. చూద్దాం.. మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంటుందో లేదో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
