Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara VaraPrasad Garu) నుంచి దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన స్పెషల్ పోస్టర్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. హిట్ మెషీన్ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా, తాజాగా విడుదలైన ఈ పోస్టర్ వాటిని మరింత పెంచింది. ఈ పోస్టర్‌లో చిరంజీవి ఒక స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ఇద్దరు చిన్నారులతో కలిసి సైకిల్ తొక్కుతూ చాలా ఉల్లాసంగా, యవ్వనంగా కనిపిస్తున్నారు. ఆయన స్టైలిష్ గ్రీన్ జాకెట్, కూల్ లుక్ వింటేజ్ చిరంజీవిని గుర్తుకు తెచ్చేలా ఉంది. ముఖ్యంగా, ఆయన ముఖంలో కనిపించే చిరునవ్వు అభిమానులకు ‘వింటేజ్ మెగాస్టార్ వైబ్’ని అందించిందనే చెప్పాలి. ఒకప్పుడు తన సినిమాలలో చూపించిన ఎనర్జీ, చరిష్మా ఈ పోస్టర్‌లో కనిపిస్తుండటంతో.. అనిల్ రావిపూడి ఈసారి అభిమానులకు ఒక మెగా ట్రీట్ ఇవ్వబోతున్నాడనేది మరోసారి స్పష్టం చేసినట్లయింది.
Also Read- Anaganaga Oka Raju: పటాకాయల షాప్‌లో పట్టు చీరలు దొరుకుతాయా.. ‘అనగనగా ఒక రాజు’ దీవాళి బ్లాస్ట్!
అనిల్ రావిపూడి మార్క్
దర్శకుడు అనిల్ రావిపూడి ఎప్పుడూ తన సినిమాలలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెద్దపీట వేస్తారనే విషయం తెలియంది కాదు. ఈ పోస్టర్‌లో చిరంజీవి పిల్లలతో కలిసి సైకిల్ తొక్కే సన్నివేశం సినిమాలోని ఫ్యామిలీ, వినోదాత్మక అంశాలను సూచిస్తోంది. అంతేకాదు, ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అనిల్ రావిపూడి చిత్ర ప్రమోషన్స్‌లోనూ తన మార్క్‌ను ప్రదర్శిస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా వచ్చిన ‘మీసాల పిల్ల’ సాంగ్ సెన్సేషన్‌ని సృష్టిస్తుందంటే.. చిరు గ్రేస్ స్టెప్స్‌తో పాటు అనిల్ రావిపూడి స్ట్రాటజీ కూడా కారణమని ఒప్పుకుని తీరాల్సిందే. సంక్రాంతికి మెగాభిమానులకు సరికొత్త ట్రీట్ ఉంటుందని, అనిల్ తన ప్రతి చర్యలో తెలియజేస్తూనే ఉన్నారు.
దీపావళి శుభాకాంక్షలు (Happy Diwali)
ఇక ఈ పోస్టర్‌ను పంచుకుంటూ మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ హృదయాలకు వెచ్చదనాన్ని, మీ ప్రయత్నాలకు విజయాన్ని, మీ ఫ్యామిలీకి సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొంటూ, పండుగ సందర్భంగా అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
Also Read- Movie Collections: కావాలనే నిర్మాతలు కలెక్షన్స్ పెంచి చెబుతున్నారా? ప్రయోజనం ఏంటి?
భారీ అంచనాలు
మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే సహజంగానే భారీ అంచనాలుంటాయి. ఈ చిత్రం సంక్రాంతి 2026కి విడుదల కానున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్, అనిల్ రావిపూడి టేకింగ్, సుస్మిత కొణిదెల సమర్పణ, సాహు గారపాటి నిర్మాణం వెరసీ.. ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ సినిమా ప్రమోషన్లకు ఒక మంచి ప్రారంభాన్ని ఇచ్చింది. ఇది ఈ సినిమాపై ఉన్న హైప్‌ని మరింత పెంచిందనే చెప్పుకోవాలి.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు! 🪔
Wishing everyone a safe, happy, and prosperous Diwali 💐
May this festival bring warmth to your hearts, success to your endeavors, and happiness to your homes✨ #ManaShankaraVaraPrasadGaru ❤️ pic.twitter.com/wTknQI7s2c
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 20, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
