Congress Party: సమర్థవంతమైన నాయకత్వం ద్వారా కాంగ్రెస్ పార్టీ ని గ్రామస్థాయి నుంచి బలపరిచే దిశగా ముందడుగు పడింది. ఖమ్మంలో డిసిసి అధ్యక్షుడి పదవికి విశేష స్పందన లభించింది. జిల్లా అధ్యక్ష పోస్టు కు 56 దరఖాస్తులు, ఖమ్మం నగర అధ్యక్ష పోస్టు కు మరో 10 దరఖాస్తు లు అందాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పది రోజుల పాటు ఏఐసిసి కార్యదర్శి కె. మహేంద్రన్ సుడిగాలి పర్యటన చేశారు . దరఖాస్తు దారుల తో ఆదివారం వన్ టు వన్ ఇంటర్వ్యూ నిర్వహించారు .
డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ కు సంబంధించి ఏఐసిసి రూపొందించిన కఠిన నిర్ణయాలను జూమ్ సమావేశం ద్వారా తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌లు పరిశీలకులకు తెలిపారు. ఆదివారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహేంద్రన్ ను శాలువాతో సత్కరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10రోజుల పాటు సమావేశాలు చురుగ్గా నిర్వహించిన పరిశీలకులను అభినందించారు .
కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్ మహేంద్రన్ , పీసీసీ అబ్జర్వర్లు డాక్టర్ పి.శ్రవణ్ కుమార్ రెడ్డి, రవళి రెడ్డి, రాజీవ్ రెడ్డి, చెక్కిలం రాజేశ్వరరావులు పాల్గొన్నారు.
