Crime News: మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ తల్లీ కుమార్తే అమెరికాలోని షికాగోలో రాత్రి కారు ప్రమాదంలో మరణించారు. ప్రమాదంలో మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ప్రయానిస్తున్న కారును అమెరికాలో ఓ టిప్పర్ డీ కొట్టడంతో తల్లీ కుతుర్లు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ వార్త విన్న మంచిర్యాల రెడ్డి కాలనీలో ఓక్కసారిగా విషాద చాయలు కమ్ముకున్నాయి.
కూతురి గృహ ప్రవేశానికి వెల్లి..
అమెరికాలో ఉంటున్న కూతురి గృహ ప్రవేశానికి వెల్లిన తల్లీ అక్కడే మరనించడంతో అందరు కన్నీటి పర్యంతం అయ్యారు. అప్పటివరకు హయిగా సాగుతున్న వారి జర్నీ విషాదంగా మిగిలింది. తమ బిడ్డను చూసేందుకు మంచిర్యాల నుంచి అమెరికాకు వెల్లిని తల్లీ కారు ప్రమాదంలో మరణించింది.
కుమారుడు బర్త్ డే సందర్బంగా..
మంచిర్యాలలోని రెడ్డి కాలనీకి చెందిన విశ్రాంత సింగరేణి కార్మికుడు విగ్నేష్ కు స్రవంతి తేజస్వీ ఇద్దరు కుమార్తెలు కలరు. వీరిద్దరు ప్రస్తుతం అమెరికాలో స్ధిరపడ్డారు. అయితే తేజస్విని గృహప్రవేశం సందర్బంగా గత నెల 18న భార్య రమాదేవితో కలిసి అమెరికా వెల్లాడు. శుక్రవారం పెద్ద కూతురి కుమారుడు బర్త్ డే సందర్బంగా విగ్నేష్ అతని భార్య తేజస్వే కలిసి కారులో బయలు దేరారు. మార్గమద్యంలో వారు ప్రయానిస్తున్న కారును టిప్పర్ బలంగా డీ కొట్టడంతో తల్లి రమాదేవి కుమార్తే తేజస్వి మృతి చెందారు. కారులో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు గాయపడ్డారు.
Also Read: Harish Rao: పంచాయతీలు పెంచుకోవడానికే క్యాబినెట్ మీటింగ్: హరీష్ రావు
