PM In Kurnool (Image Source: twitter)
ఆంధ్రప్రదేశ్

PM In Kurnool: చంద్రబాబు, పవన్ చాలా పవర్‌ఫుల్.. అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది.. ప్రధాని మోదీ ప్రశంసలు

PM In Kurnool: కర్నూలులో జరిగిన ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేదిక నుంచి రూ. 13429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. రూ. 9,449 కోట్ల విలువైన 5 అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ. 1,704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే రూ. 2,276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులను వేదిక నుంచి జాతికి అంకితం చేశారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రగతి పథంలో ఏపీ..

సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఏపీలో విజన్ ఉన్న నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి నేతలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. గత 16 నెలల్లో డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఏపీలో ప్రగతి వేగంగా జరుగుతోంది. ఢిల్లీ, అమరావతిలు రెండూ వేగంగా అభివృద్ది దిశగా వెళ్తున్నాయి. దేశంలో విద్యుత్, రైల్వే, జాతీయ రహదారులు, రక్షణ రంగాలకు చెందిన చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశాం. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్రంలో కనెక్టివిటి బలోపేతం చేయడంతో పాటు పరిశ్రమలను బలోపేతం చేస్తాయి. ఈ ప్రాజెక్టులతో కర్నూలుతో పాటు పరిసర ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుంది’ అని మోదీ అన్నారు.

‘ఇంధన భద్రత చాలా ముఖ్యం’

దేశానికైనా, రాష్ట్రానికైనా ఇంధన భద్రత అవసరమని ప్రధాని మోదీ అన్నారు. ‘ప్రస్తుతం 3 వేల కోట్ల విలువైన ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టులను ప్రారంభించాం. తద్వారా దేశ ఇంధన సామర్ధ్యం పెరుగుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్లాక్ అవుట్ లాంటి విద్యుత్ సంక్షోభాలు వచ్చాయి. తలసరి విద్యుత్ వినియోగం 1000 యూనిట్ల కంటే తక్కువే ఉంది. చాలా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు క్లీన్ ఎనర్జీ నుంచి మన అవసరాలకు తగినంత ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నాం. 1400 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు దేశంలో ఉంది. తగినంత విద్యుత్ దేశ ప్రజలకు లభ్యం అవుతోంది’ అని ప్రధాని చెప్పుకొచ్చారు.

‘ఏపీ అభివృద్ధిని ప్రపంచం గమనిస్తోంది’

దేశ ఆర్ధిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ఓ కీలక ప్రాంతంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శక్తివంతమైన నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ది దిశగా నడుస్తోంది. 20 వేల సిలిండర్ల సామర్ధ్యంతో ఇండేన్ బాటిలింగ్ ప్లాంట్‌ను చిత్తూరులో ప్రారంభించాం. మల్టీమోడల్ ఇన్ఫ్రా ప్రాజెక్టులతో కనెక్టివిటీ పెంచుతున్నాం. సబ్బవరం నుంచి షీలా నగర్ వరకూ కొత్త హైవేతో కనెక్టివిటీ పెరిగింది. రైల్వే రంగంలో కొత్త యుగం ప్రారంభమైంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా ప్రాజెక్టులను ప్రారంభించుకున్నాం. వికసిత్ భారత్ 2047 సాధన సంకల్పానికి స్వర్ణాంధ్ర లక్ష్యం మరింత బలం అందిస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ వేగాన్ని మరింతగా పెంచుతుంది. భారత్ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రగతి వేగాన్ని ప్రపంచం గమనిస్తోంది’ అని మోదీ అన్నారు.

Also Read: Super GST – Super Savings: మోదీ తెచ్చిన సంస్కరణలు.. దేశానికి గేమ్ ఛేంజర్లు.. సీఎం చంద్రబాబు

విశాఖకు గూగుల్ రావడంపై..

గూగుల్ లాంటి ఐటీ దిగ్గజం ఏపీలో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘దేశపు తొలి అతిపెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికా వెలుపల భారీ పెట్టుబడితో ఏపీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హబ్ పెడుతున్నట్టు గూగుల్ సీఈఓ చెప్పారు. డేటా సెంటర్, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ లాంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. ప్రపంచ దేశాలను కలుపుతూ వేయనున్న సబ్ సీ కేబుల్ ద్వారా తూర్పు తీరం బలోపేతం అవుతుంది. విశాఖలో ఏర్పాటు కానున్న కనెక్టివిటీ హబ్ భారత్ కే కాదు ప్రపంచానికి సేవలందింస్తుంది. సీఎం చంద్రబాబు విజన్ ను అభినందిస్తున్నాను. దేశ ప్రగతికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా కీలకం ఏపీ అభవృద్ధి చెందాలంటే రాయలసీమ కూడా అభివృద్ధి అంతే అవసరం. కర్నూలులో ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు తెరుస్తాయి. పారిశ్రామిక అభివృద్ది వేగంగా జరుగుతోంది’ అని ప్రధాని కొనియాడారు.

Also Read: Student Suicide: బీటెక్ కాలేజీలో దారుణం.. క్లాస్ రూమ్‌లో విద్యార్థి సూసైడ్.. నిరసనకు దిగిన స్టూడెంట్స్

Just In

01

Alcohol Addiction: ఆకలితో ఉన్నప్పుడు బాటిల్స్ మీద బాటిల్స్ మద్యం సేవిస్తున్నారా.. బయట పడ్డ షాకింగ్ నిజాలు

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్