Pakistan-Airstrikes (Image source Twitter)
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Afghan Cricketers Died: పాకిస్థాన్ వైమానిక దాడులు.. ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు మృతి

Afghan Cricketers Died: పొరుగుదేశం ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ అనాగరిక చర్యలకు పాల్పడుతోంది. ఇరుదేశాల మధ్య సరిహద్దులో పరస్పర దాడుల నేపథ్యంలో కుదిరిన 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసిన వెంటనే, శుక్రవారం రాత్రి అఫ్ఘాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లో పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. డ్యురండ్ లైన్ వెంబడి ఉన్న అర్గున్, బెర్మూల్ జిల్లాల్లో జనావాస ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఇరుదేశాలకు చెందిన బృందాలు శాంతి చర్చల కోసం ఖతార్‌లోని దోహాలో ఉండగానే పాక్ ఈ దుశ్చర్యలకు పాల్పడింది. పాకిస్థాన్ వైమానిక దాడుల్లో మొత్తం 8 మంది చనిపోగా, అందులో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు (Afghan Cricketers Died) ఉండడం తీవ్ర విషాదంగా మారింది. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) స్వయంగా ప్రకటించింది. కన్నుమూసిన క్రికెటర్ల పేర్లు కబీర్, సిబ్గతుల్లా, హరూన్‌గా గుర్తించామని తెలిపింది.

మృత్యువాతపడిన ముగ్గురు క్రికెటర్లు, ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు తూర్పు పాక్టికాలోని షరానా పట్టణానికి వెళ్లారు. ఈ ప్రాంతం పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. పాకిస్థాన్ దుశ్చర్యను ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా ఖండించింది. ఉర్గున్ జిల్లాకు చెందిన ధైర్యవంతమైన యువ క్రికెటర్లు అమరులు కావడం చాలా బాధ కలిగిస్తోందని, ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొంది. పాకిస్థాన్ ప్రభుత్వం పిరికిపంద చర్యకు పాల్పడిందని, ఇదొక కిరాతకమైన దాడిగా అభివర్ణించింది.

Read Also- Tollywood hero remuneration: సినిమా హీరోలకు ఎందుకంత రెమ్యూనరేషన్.. సినిమా అంటే ఒక్కరేనా?

ముక్కోణపు సిరీస్ రద్దు

పాకిస్థాన్ దాడి, ముగ్గురు క్రికెటర్ల మృతి నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో పాకిస్థాన్, శ్రీలంకతో కలిసి ఆడాల్సిన ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. అమరులైన ముగ్గురు క్రికెటర్లకు గౌరవసూచకంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది.

తీవ్రంగా ఖండించిన రషీద్ ఖాన్

పాకిస్థాన్ దాడుల్లో ముగ్గురు యువక్రికెటర్ల మృతిపై ఆఫ్ఘనిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. పాక్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశాడు. పాకిస్థాన్‌తో జరగాల్సిన ముక్కోణపు సిరీస్‌ నుంచి తప్పుకుంటూ ఏసీబీ (ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు) నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపాడు. ‘‘ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలుగన్న యువ క్రికెటర్లతో పాటు మహిళలు, పిల్లలు కూడా పాకిస్థాన్ దాడుల్లో చనిపోయారు. వారి మరణ వార్త నాకు చాలా బాధను కలిగించింది. జనాలు నివసించే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం అనాగరికం, ఇది క్రూరమైన చర్య. ఇలాంటి ఆటవిక, చట్ట విరుద్ధమైన చర్యలు మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి. ఇలాంటివాటిని పట్టించుకోకుండా ఉండకూడదు’’ అని రషీద్ ఖాన్ వ్యాఖ్యానించాడు.

ఎంతో విలుమైన ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, పాకిస్థాన్‌తో క్రీడలు ఆడకూడదంటూ ఏసీబీ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ సంక్లిష్ట సమయంలో నా దేశ ప్రజలకు అండగా నిలుస్తాను. దేశ గౌరవమే మాకు తొలి ప్రాధాన్యత’’ అని భావోద్వేగంగా స్పందించారు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మరో ఇంటర్నేషనల్ క్రికెటర్ మోహమ్మద్ నబీ స్పందిస్తూ, ఈ ఘటన పాక్టికా ప్రావిన్స్‌కి మాత్రమే కాకుండా, యావత్ దేశానికి, మొత్తం ఆఫ్ఘాన్ క్రికెట్ కుటుంబానికి విచారకరమైన ఘటన అని అభివర్ణించాడు. పాక్ కిరాతక దాడుల్లో అమాయక ప్రజలతో పాటు క్రికెట్ ఆటగాళ్లు కూడా మృతి చెందడం క్షమించరాని నేరమంటూ ఆఫ్ఘాన్ పేసర్ ఫరూకీ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు.

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?