tollywood-heros( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Tollywood hero remuneration: సినిమా హీరోలకు ఎందుకంత రెమ్యూనరేషన్.. సినిమా అంటే ఒక్కరేనా?

Tollywood hero remuneration: టాలీవుడ్, తెలుగు సినిమా పరిశ్రమ, భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యంత లాభదాయకమైన రంగాల్లో ఒకటి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ వంటి పాన్-ఇండియా హిట్లతో దక్షిణాది సినిమా ఉత్తర భారతం, విదేశాల్లో గట్టి పట్టు సాధించాయి. కానీ ఈ విజయానికి ప్రధాన కారణం హీరోల అసాధారణ రెమ్యునరేషన్ – అంటే జీతాలు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’కు రూ.200-300 కోట్లు డిమాండ్ చేశారు. ప్రభాస్ ప్రతి సినిమాకు రూ.100 కోట్లకు పైగా తీసుకుంటున్నాడు. ఇది సాధారణమా? లేక ఇండస్ట్రీకి భారం అవుతుందా? సినిమా అంటే ఒక్క హీరో కోసమా? ఈ అధిక జీతాల వల్ల ఎవరు నష్టపోతున్నారు? ఈ ఆర్టికల్‌లో ఈ ప్రశ్నలకు వివరంగా సమాధానం చూద్దాం.

Read also-Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరుపుతున్న బడా నిర్మాత!.. దర్శకుడు ఎవరంటే?

అధిక రెమ్యునరేషన్‌కు కారణాలు

టాలీవుడ్ హీరోలు ఎందుకు ఇంత భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? ఇది ఒక్క కారణం కాదు, దీనికి అనేక ఫ్యాక్టర్లు కలిసి పనిచేస్తాయి. మొదట హిట్ అందుకున్న తర్వాత హీరోల డిమాండ్ డబుల్ అవుతుంది. ఒకటి లేదా రెండు హిట్ సినిమాల తర్వాత హీరోలు రెమ్యూనరేషన్ 2-3 రెట్లు పెంచుకుంటారు. ఉదాహరణకు, ‘డీజే టిల్లు’ హిట్ అయ్యాక సిద్దు జోన్నలగడ్డ జీతం డబుల్ అయింది. పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్లు కూడా ఇలానే చేస్తారు. ఎందుకంటే, హీరోల ‘మార్కెట్ వాల్యూ’ – బాక్సాఫీస్, డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ ఇలా అన్నీ కలిపి రెమ్యూనరేషన్ హై అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో 2,800 స్క్రీన్లు, అమెరికాలో భారీ కలెక్షన్లు ఉన్నాయి. ఇది మలయాళ సినిమాతో పోలిస్తే (592 స్క్రీన్లు మాత్రమే) భారీ అవకాశం.

Read also-Star Directors: ఈ స్టార్ డైరెక్టర్స్ ఎందుకింత గ్యాప్ తీసుకుంటున్నారు?

రెండవది, పాన్-ఇండియా పాపులారిటీ. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్, ‘పుష్ప’తో అల్లు అర్జున్, ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉత్తర భారతం, హిందీ డబ్బింగ్ మార్కెట్‌లో హిట్ అయ్యారు. ఇది రెమ్యూనరేషన్ రూ.12-15 కోట్ల నుంచి రూ.50-100 కోట్లకు పెంచేశారు. ఫ్యాన్ బేస్ కీలకం ఫ్యాన్స్ థియేటర్లలో మాస్ మొబిలైజేషన్ చేసి, ఓపెనింగ్ డే కలెక్షన్లు రికార్డులు సృష్టిస్తారు. ఇది ప్రొడ్యూసర్లకు ‘సేఫ్ బెట్’గా మారుతుంది.

మూడవది, బిజినెస్ మోడల్ బ్లాక్ మనీ. ప్రొడ్యూసర్లు తమ బ్లాక్ మనీని లాండర్ చేయడానికి హై బడ్జెట్లు పెడతారు. హీరోలకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి, రైట్స్ అమ్ముకుని వైట్ మనీ చేస్తారు. ఇది ప్యాషన్ కంటే బిజినెస్‌గా మారింది. మలయాళ సినిమాలో లాభాల షేర్ మోడల్ ఉంటుంది, కానీ టాలీవుడ్‌లో అప్‌ఫ్రంట్ ఫీజ్ మాత్రమే. ఇలా, సప్లై-డిమాండ్, ఫ్యాన్ పవర్, మార్కెట్ సైజ్ కలిసి రెమ్యూనరేషన్ ను ఆకాశాన్ని తాకేలా చేశాయి.

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?