Pawan Kalyan: టాలీవుడ్ చిత్రసీమలో మరో క్రేజీ కాంబినేషన్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ‘ఓజీ’ తర్వాత సినిమాల గురించి ప్రస్తావించని పవన్ కళ్యాణ్ దగ్గరకు అనేక కొత్త కథలు క్యూ కడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను కేవీన్ ప్రొడక్షన్స్ నిర్మాత కలిసి సినిమా గురించి చర్చలు జరుపుతున్నారన్న విషయం తెలిసిందే.. తాజాగా దీనికి సంబంధించి మరో న్యూస్ తెగవైరల్ అవుతోంది. ఈ సినిమాకు లోకేష కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారట. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కనుక సెట్ అయితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఫీస్టే అవుతుందిని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ కాంబినేషన్ ఒక మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని, హీరో పవన్ కళ్యాణ్ మాస్ అప్పీల్‌తో లోకేష్ ఇంటెన్స్ నరేటివ్ స్టైల్ కలిసి పాన్-రీజియనల్ హిట్‌ను సృష్టించవచ్చని అంచనా వేస్తున్నారు.
Read also-Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’లో దేవీ శ్రీ ప్రసాద్‌కు జోడీ ఎవరంటే?
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడని, త్వరలో పెద్ద ప్రకటన వచ్చే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ కనగరాజ్‌తో పాటు మరో తమిళ డైరెక్టర్ ఎచ్. వినోత్ కూడా చర్చల్లో ఉన్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతానికి లోకేష్ కనగరాజ్ మందు వరుసలో ఉంటారు. ఈ ఫిల్మ్ బైలింగ్వల్ (తెలుగు-తమిళం) ప్రాజెక్ట్‌గా రూపొందనుంది, ఇది పవన్ ఫ్యాన్‌బేస్‌ను మరింత విస్తరింపజేయవచ్చు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, అతని సినిమా కమిట్‌మెంట్స్ ఎప్పటికీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయి. ‘ఓజీ’ తర్వాత పవన్ కళ్యాణ్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు కేవీఎన్‌తో ఈ కొత్త ప్రాజెక్ట్, అది కూడా లోకేష్ లాంటి క్రాఫ్టీ డైరెక్టర్‌తో, ఇండస్ట్రీలో ఎక్సైట్‌మెంట్‌ను పెంచింది.
Read also-King Nagarjuna: 100వ చిత్రం.. కింగ్ నాగార్జున చేస్తుంది రైటా? రాంగా?
లోకేష్ కనగరాజ్ తన కెరీర్‌లో విక్రమ్, ఖైదీ, వంటి బ్లాక్‌బస్టర్లతో గుర్తింపు పొందాడు. అతని ఫిల్మ్‌లు యాక్షన్, సస్పెన్స్, ఎమోషన్ మిక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పవన్ కళ్యాణ్ మాస్ హీరోగా ఉన్నాడు, కానీ లోకేష్ టచ్‌తో ఈ కాంబినేషన్ ఒక ఇంటెన్స్ మాస్ ఎంటర్‌టైనర్‌గా మారవచ్చు. ఇది పవన్‌కు తమిళ మార్కెట్‌లో కొత్త బ్రేక్‌తోవచ్చే అవకాశం కూడా ఉంది. అయితే, ప్రాజెక్ట్ టైమ్‌లైన్ ఇంకా క్లియర్ కాలేదు. పవన్ రాజకీయ బాధ్యతలు, ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేము. కానీ, ఈ ఊహాగానాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)లో ఫ్యాన్స్ ఈ కాంబినేషన్‌పై ఎక్సైట్‌మెంట్‌గా చర్చిస్తున్నారు. ఈ సినిమా గనక సెట్ అయితే పవన్ కళ్యాణ్ కు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వస్తుంది. ఇదే కనుక నిజం అయతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.
