King Nagarjuna (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

King Nagarjuna: 100వ చిత్రం.. కింగ్ నాగార్జున చేస్తుంది రైటా? రాంగా?

King Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (King Akkineni Nagarjuna) తన సినీ ప్రయాణంలో ఓ ప్రతిష్టాత్మక మైలురాయిని చేరుకున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఆయన 100వ చిత్ర (100th Film) షూటింగ్ రీసెంట్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌కి ఆయన ఎంచుకున్న దర్శకుడి విషయంలోనే అభిమానుల్లో, సినీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళ దర్శకుడైన ఆర్ కార్తీక్ (Ra Karthik) ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఆయనకు కేవలం ‘నితం ఒరు వానం’ (తెలుగులో ‘ఆకాశం’) అనే ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉంది. మైల్‌స్టోన్‌ మూవీకి కొత్త దర్శకుడా? నాగార్జున 100వ సినిమా అంటే టాలీవుడ్‌కు చెందిన స్టార్ డైరెక్టర్‌తో ప్లాన్ చేస్తారని అభిమానులు బలంగా ఊహించారు. గతంలో ‘గాడ్‌ఫాదర్’ దర్శకుడు మోహన్ రాజా పేరు కూడా ఈ విషయంలో వినిపించింది. కానీ, అనుభవం తక్కువగా ఉన్న దర్శకుడికి ఇంతటి కీలకమైన ప్రాజెక్ట్‌ను అప్పగించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 100వ సినిమా అంటే కెరీర్‌లో ఒక పెద్ద విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ నిర్ణయం వల్ల సినిమా ఫలితంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం రైటా, రాంగా అనే చర్చ సర్వత్రా నడుస్తోంది.

Also Read- Tollywood Box Office: నాలుగు సినిమాలు రిలీజ్ అయితే.. బాక్సాఫీస్ వద్ద సందడేది? వీక్ ఓపెనింగ్స్!

నాగార్జున ప్లానింగే వేరు

కథలో దమ్ముంటే రిస్క్ రైటే! మరోవైపు, నాగార్జున తీసుకునే నిర్ణయాలను చాలా జాగ్రత్తగా, వ్యాపార దృక్పథంతో ఆలోచించి తీసుకుంటారని ఆయన అభిమానుల్లో కొందరు గట్టిగా నమ్ముతున్నారు. 100వ సినిమా కావడం, అది కూడా తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) బ్యానర్‌పై తీస్తుండడం వలన, దర్శకుడు కొత్త అయినా సరే.. కథలో బలం ఉందనే ఆయన ఈ అవకాశాన్ని ఇచ్చి ఉంటారని అంటున్నారు. గతంలోనూ నాగార్జున కొత్త దర్శకులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించిన చరిత్ర ఉంది. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులను పరిచయం చేసి విజయం సాధించారు. కాబట్టి, కథపై నమ్మకంతోనే నాగార్జున ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, అభిమానులు భయపడాల్సిన అవసరం లేదని వారు వాదిస్తున్నారు.

Also Read- Jatadhara Trailer: ధన పిశాచిగా సోనాక్షి విశ్వరూపం.. ట్రైలర్ ఎండింగ్ అస్సలు మిస్సవ్వకండి!

‘లాటరీ కింగ్’

ఈ చిత్రం యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషన్ అంశాలతో కూడిన పొలిటికల్ డ్రామాగా ఉండబోతుందని, ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనేలా ప్రచారం నడుస్తుంది. కథానాయికలుగా టబు, అనుష్క శెట్టి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద, నాగార్జున 100వ చిత్రంపై ఉన్న అంచనాలు, దర్శకుడి ఎంపికపై ఉన్న అనుమానాలు సినిమా విడుదలయ్యేంత వరకు కొనసాగేలా కనిపిస్తున్నాయి. కింగ్ తీసుకున్న నిర్ణయం ‘రైటా, రాంగా’ అనేది బాక్సాఫీస్ ఫలితమే తేల్చాలి. ఇక ఇటీవల కింగ్ నాగార్జున వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెలిసిందే. ‘కుబేర’ సినిమాలో పాత్రతో పాటు, ‘కూలీ’ సినిమాలో చేసిన విలన్ పాత్ర కూడా ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. మరోవైపు ‘బిగ్ బాస్’ రియాలిటీ షో హోస్ట్‌గా నాగ్ దూసుకెళుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?