Ellamma movie: బలగం వేణు బలగం తర్వాత తీయబోయే చిత్రం ‘ఎల్లమ్మ’పై భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే ఈ కథ ఇప్పటివరకూ చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లి చివరకు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ చేతికి చేరింది. ఈ సినిమా దాదాపు ఖరారు అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ కు జోడీగా కీర్తీ సురేశ్ నటించబోతుందని సమాచారం. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. మొదటి నుంచీ ‘ఎల్లమ్మ’ సినిమాకు కష్టాలు తప్పలేదు. మొదట ఈ సినిమాలో హీరోగా నాని అనుకున్నారు. అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత నితిన్ అనుకున్నారు. అయన కూడా తప్పుకున్నట్లు సమాచారం. మళ్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుకున్నారు. చివరిగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఫిక్సయ్యారు.
Read also-Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు.. ఎందుకంటే?
నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న కమెడియన్ వేణు బలగం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే తన రెండో సినిమాగా ‘ఎల్లమ్మ’ను దిల్ రాజు బేనర్ లో తెరకెక్కిస్తున్నాడు. 2023లో విడుదలై, కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకుల మనసులు ఆకర్షించిన ‘బలగం’ తర్వాత, వేణు మరో గ్రామీణ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘ఎల్లమ్మ’ (Ellamma) సినిమా, గ్రామీణ దేవత ఎల్లమ్మను కేంద్రంగా చేసుకుని, ఒక దళిత సముదాయానికి చెందిన పాట సమూహం భావోద్వేగ యాత్రను చిత్రిస్తుంది. ఈ కథలో వారి కలలు, కష్టాలు, ఆధ్యాత్మికత మధ్య సంఘర్షణలు ముఖ్యమైనవి. వేణు, నిజ జీవితాల నుంచి ప్రేరణ పొంది ఈ కథను రూపొందించారు.
Read also-Jugari Cross: ఆ నవలే సినిమాగా.. టైటిల్ ప్రోమో ఎలా ఉందంటే..
ప్రొడక్షన్ విషయానికి వస్తే, ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మించనున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లు మించుతుందని అంచనా. కాస్టింగ్ డిలేల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుంది. డీఎస్‌పీ లాక్ అయ్యాక, డిసెంబర్, 2025లో షూట్ స్టార్ట్ కావచ్చని సినిమా పెద్దలు అంచనా వేస్తున్నారు. వేణు యెల్డండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ ఒక ఎమోషనల్ ఫీస్ట్‌గా ఉంటుందని నిర్మాత పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. బలగం లాంటి సక్సెస్ కొనసాగితే, ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. తాజా బజ్‌తో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు హీరో హీరోయిన్ కూడా ఫిక్స్ అవడంతో సినిమా పట్టాలెక్కించడాని సిద్ధంగా ఉంది.
