Crime News (imagecredit:twitter)
క్రైమ్

Crime News: ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం సీజ్.. దాని విలువ ఎంతో తెలిస్తే మీరు షాక్..!

Crime News: డైరెక్టరేట్ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 2.37కోట్ల రూపాయల విలువ చేసే పసిడిని(Gold) సీజ్ చేశారు. ధరలు చుక్కలను తాకుతున్న నేపథ్యంలో బంగారం స్మగ్లింగ్ ను నిరోధించటానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్(Air Port)ల సిబ్బందితోపాటు డైరెక్టరేట్ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దాంతో అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే గురువారం కువైట్(Kuwait) నుంచి షార్జా మీదుగా హైదరాబాద్(Hyderabad) వచ్చిన ఓ ప్రయాణికున్ని పట్టుకున్నారు. అతని లగేజీని తనిఖీ చేయగా 1.8కిలోల బరువున్న బంగారు బిస్కెట్లు దొరికాయి. ఈ క్రమంలో సదరు ప్రయాణికున్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Also Read: Vijay Deverakonda: క్రియేటివ్ దర్శకుడితో విజయ్ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్.. గ్రీన్ సిగ్నల్ పడిందా?

ధూల్ పేటలో..
గంజాయి అమ్ముతున్న ఇద్దరిని ఎక్సయిజ్​ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.830 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ధూల్ పేట.. పురానాపూల్ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారం అందటంతో సీఐ అంజిరెడ్(Anjireddy)డి సిబ్బందితో కలిసి రూట్ వాచ్ జరిపారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న బద్రినారాయణ సింగ్(Badrinarayan Singh), రాజాసింగ్(Raja Singh) లను అదుపులోకి తీసుకుని వారి నుంచి గంజాయితోపాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గంజాయి అమ్మకాలతో ముఖేశ్(Mukesh), మంజు దేవి(Manu Devi), ప్రతీక్​ సింగ్(Prateek Singh) లకు కూడా సంబంధం ఉన్నట్టు తేలటంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

Also Read: Local Body Polls: భలే పనైంది.. ఇక స్థానిక ఎన్నికలు జరిగేది అప్పుడేనా?

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?