Warangal Mayor ( image credit: seetcha reporter)
నార్త్ తెలంగాణ

Warangal Mayor: మేయర్ గారు ఇది మీకు తగునా? పద్మశాలి కమ్యూనిటీ హాల్ స్థలంపై కన్ను!

Warangal Mayor: మీ సామాజిక వర్గానికి తగిన సాయం చేసి చేయుత నివాల్సిన మీరే మా అన్యాయం చేయాలని కుట్ర చేయడం మీకు తగునా అమ్మ అంటూ వరంగల్ మేయర్ (Warangal Mayor) గుండు సుధారాణిని (Gundu Sudharani) ఉమ్మడి వరంగల్ జిల్లాలో పద్మశాలు నిలదీస్తున్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గత ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన రెండు ఎకరాల భూమిని పథకం ప్రకారం నగర మేయర్ గుండు సుధారాణి తన భర్త ప్రభాకర్ ను ముందు పెట్టి కులానికి సంబంధించిన కమ్యూనిటీ స్థలంపై కన్నేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆమే పై గతంలో నక్కలగుట్టలో పార్కు స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుతం తన సొంత సామాజిక వర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఈ టాపిక్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read:  Warangal District: స్థానిక సమరంపై సందిగ్ధంలో ఆశావహులు.. ఇంకేమైనా మార్పులు వచ్చేనా!

ప్రభుత్వ భూమి కోసం తన వారి పేరుపై కొత్త సొసైటీ రిజిస్ట్రేషన్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పద్మశాలి కులస్తుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిర్మించాలనే సంకల్పంతో హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండలం చింతగట్టులోని సర్వే నెంబర్ 146/2.,155/1 లో మొత్తం రెండెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన డాక్టర్ రంజిత్ కుమార్ ప్రభుత్వ ఆదేశాల మేరకు 2021 ఫిబ్రవరి 10న మెమో నంబర్.8730/LA/A2/2020-2. తో ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అదునుగా భావించిన నగర మేయర్ గుండు సుధారాణి తన భర్త గుండు ప్రభాకర్ అధ్యక్షుడిగా అల్లుడు అనిల్ కుందారపును ట్రెజరర్ గా పెట్టి పద్మశాలి సంఘం పేరిట కొత్త సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధ్యక్షుడిగా డీఎస్ మూర్తి, ప్రధాన కార్యదర్శిగా గోరంటల రాజు ఉన్నారు.

ప్రభుత్వ భూమిని అప్పగించే విధంగా తగు జాగ్రత్తలు

అయినా తన పలుకుబడి ఉపయోగించి కొత్త సొసైటీ కి ఆజ్యం పోశారు. పద్మశాలి సంఘం నేతలతో మాట్లాడకుండానే వారికి ఏ విషయం తెలియకుండా మేయర్ ఏకపక్షంగా 2021 ఫిబ్రవరి 18న తన సన్నిహితులు ఏడుగురు సభ్యులతో ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించి 112/2021 తో 15/8/ 41 ఇంటి నెంబర్ ను రామన్నపేట లో ఆఫీసు అడ్రస్ గా చూపిస్తూ, తన భర్త గుండు ప్రభాకర్ కు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి 2021 జులై 14 హసన్పర్తి ఇరిగేషన్ సబ్ డివిజన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేత ఈ రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని తన భర్త గుండు ప్రభాకర్ కు అధికారికంగా అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా పద్మశాలి కుల సంఘం నేతలను బాధ్యతలు ఇవ్వకుండా గుర్తు చప్పుడు కాకుండా ఏకంగా రెండెకరాల భూమిని తన భర్త ప్రభాకర్ పేరిట భూ బదలాయింపు చేసిన విషయం తెలిసి ఇప్పుడు పద్మశాలి సంఘం నేతలు బగ్గుమంటున్నారు.

అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే కుట్ర

గుండు సుధారాణి రాజకీయ ఎదుగుదలకు పద్మశాలి కుల సంఘాలు కీలక పాత్ర పోషించాయని పలు సమావేశంలో చెప్పిన సుధారాణి, మేయర్ పదవి చేపట్టాక కులస్తులను శత్రువుగా చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. హనుమకొండలో పద్మశాలి కమ్యూనిటీ హాల్ కోసం ప్రభుత్వం రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయిస్తే మేయర్ తన సొంత జాగీర్ అనుకుని ఏడుగురితో పేపర్ పై కమిటీ వేసి రిజిస్టర్ చేయించడం ఎంతవరకు సమంజసం అని పద్మశాలి కుల పెద్దలు ప్రశ్నిస్తున్నారు. త్వరలో పద్మశాలి సంఘం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి నిజాలను బహిర్గతం చేయాలని పద్మశాలి కులస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సామాజిక వర్గంతో సంబంధం లేని వారితో సొసైటీ ఏర్పాటు

పద్మశాలి సంఘంలో చేనేత కార్మికులు, పద్మశాలి కుల పెద్దల ను కాకుండా, పద్మశాలి సంఘాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులను, సొసైటీగా ఏర్పాటు చేసుకొని చేనేత కార్మికులకు నైపుణ్యము శిక్షణ అందించాలనే దృక్పథంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ స్థలాన్ని మేయర్ గుండు సుధారాణి భర్త గుండు ప్రభాకర్ మరియు తమ కుటుంబానికి అనుకూలంగా ఉండే కొంతమందితో కలిసి కొత్త సొసైటీని రిజిస్టర్ చేపించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేటాయించిన స్థలాన్ని, వరంగల్ జిల్లాకు మాత్రమే కేటాయించినట్లుగా మార్చి ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. చట్ట విరుద్ధంగా పద్మశాలీలను కాదని ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ లో సాక్షులుగా తమ కుటుంబానికి అనుకూలంగా ఉన్న ముస్లిం వ్యక్తిని చూపించారు. పద్మశాలీలను కాదని ముస్లిం వ్యక్తిని ఎలా సాక్షిగా పిలుస్తారని ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా రెండెకరాల స్థలాన్ని పద్మశాలి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రముఖులను, పద్మశాలి సంఘానికి సేవ చేస్తున్న, వ్యక్తులను పిలిచి సర్వసభ్య సమావేశ నిర్వహించి, ఉమ్మడి వరంగల్ జిల్లా సొసైటీకి అప్పగించాలని కోరుతున్నాం.

డాక్టర్. చందా మల్లయ్య.
పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.
హనుమకొండ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు.

Also ReadWarangal Commissioner: నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయాన్ని నేరస్తులకు కలిగించాలి.. సీపీ సన్ ప్రీత్ సింగ్

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది