Warangal Commissioner: ఎదైన నేరం చేస్తే కోర్టులో శిక్ష పడుతుందనే భయాన్ని నేరస్తులకు కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్(Warangal Police Commissioner) సూచించారు. ఈ ఏడాది జనవరి నెల నుండి ఆగస్టు మాసం వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ న్యాయ స్థానాల్లో జరిగిన ట్రయల్స్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడటంలో కృషి చేసిన పోలీస్‌అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల అభినందన సభను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఏర్పాటు చేసారు.
కోర్టులో శిక్షలు పడిన శాతం?
ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్(Warangal Police Commissioner) ముఖ్య అతిధిగా పాల్గోని నిందితులకు కోర్టులో శిక్షలు పడటంలో కృషి చేసిన జాయింట్ డిప్యూటీ డైరక్టర్, డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దర్యాప్తు అధికారులు, కోర్టు,ప్రాసెస్ విధులు నిర్వహించే పోలీస్ అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ కమిషనర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించి ప్రశంస పత్రాలను అందజేసారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గతంలో ఏన్నడూ లేని విధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ నేరాలకు పాల్పడిన నేరస్తులకు కోర్టులో శిక్షలు పడిన శాతం పెరిగింది.
యావజ్జీవ కారాగార శిక్ష
ఇది ఏ ఒక్కరి వలన జరిగిందని కాదని. ఏవరికి వారు వారికి అప్పగించిన విధులను బాధ్యతయుతంగా నిర్వర్తించడం ద్వారా ఇలాంటి మెరుగైన ఫలితాలను రావడం జరిగిందని. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జరిగిన ట్రయల్ కేసుల్లో మొత్తం 16 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని. ఇందులో 6 హత్య కేసుల్లో ఐదు కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడగా,ఒక కేసులో పది సంవత్సరాల జైలు శిక్షను కోర్టు విధించగా, నాలుగు ఆత్యాచారం కేసుల్లో రెండు కేసుల్లో జీవితఖైదు, మరో రెండు కేసుల్లో ఇరువై సంవత్సరాల జైలు విధించగా, ఎస్టీ,ఎస్సీ మానభంగం కేసులో ఏడు సంవత్సరాలు, చోరీ మరియు ఇతర కేసులకు సంబంధించి ఐదు కేసుల్లో మూడు సంవత్సరాల చోప్పున జైలు విధించడం జరిగింది.
పోలీసులపై ప్రజలకు నమ్మకం గౌరవం
నిందితులకు శిక్షలు పడటం ద్వారా బాధితులను న్యాయం జరగడంతో పాటు కోర్టు, పోలీసులపై ప్రజలకు నమ్మకం గౌరవం పెరుగుతుందని. నేరస్తులకు పడటం కోసం పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంలో పనిచేయాల్సిన అవసరం వుందని. ఇందుకోసం ఇన్స్‌స్పెక్టర్ స్థాయి పోలీస్ అధికారిని కోర్టు మానిటరింగ్ అధికారిగా నియమించడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
ఈ కార్యక్రమములో అదనపు డిసిపి రవి, వరంగల్ ప్రాసిక్యూషన్ ఆఫ్ జాయింట్ డిప్యూటీ డైరక్టర్ రాములు, సంగారెడ్డి జిల్లా ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరక్టర్ సత్యనారయణ ,సిసిఆర్‌బి ఏసిపి డేవిడ్ రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు,సంతోషి,శ్రీనివాస్,వాసుదేవ రెడ్డి,పావని,రాజమల్లా రెడ్డి,దుర్గాబాయి,భరోసాకేంద్రం న్యాయధికారి నీరజ, ఇన్స్‌స్పెక్టర్లు శ్రీధర్,ముస్కా శ్రీనివాస్,రవికుమార్,కరుణాకర్, పుల్యాల కిషన్,ఎస్.ఐ నర్సింహరావుతో పాటు సిసిఆర్‌బి సిబ్బంది, కోర్టు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డ్సు పాల్గోన్నారు.