Swetcha Effect: పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ(Distribution of fine rice)లో జరుగుతున్న అక్రమాలపై ‘స్వేచ్ఛ’ వెబ్ సైట్, పత్రికలలో ప్రచురించబడిన కథనాలకు (ముఖ్యంగా “మళ్లీ మొదలైన రేషన్ బియ్యం దందా,” “రాత్రయితే రేషన్‌కు రెక్కలు”) అధికారులు వెంటనే స్పందించారు. అక్రమార్కులకు వరంగా మారిన రేషన్ బియ్యం దందాపై ఖమ్మం(Khammam) జిల్లాలో అధికారులు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేలకొండపల్లి(Nelakondapally) మండలం కొత్త కొత్తూరు వద్ద ఉన్న దుర్గాభవాని రైస్ మిల్లు(Durga Bhavani Rice Mill)లో రేషన్ బియ్యం నిల్వ ఉందనే విశ్వసనీయ సమాచారం మేరకు, సోమవారం రాత్రి సివిల్ సప్లై (పౌర సరఫరాల శాఖ), పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి..
ఈ మెరుపు దాడుల్లో అధికారులు మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపుగా 100 క్వింటాళ్ల పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రకాల బియ్యం నమూనాలను పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై డీటీ నాగలక్ష్మి(Nagalxmi), మెచ్చ రాంబాబు, టెక్నికల్ అధికారి సునీతతో పాటు నేలకొండపల్లి ఎస్సై సంతోష్(SI Santhosh), పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ‘స్వేచ్ఛ’ పత్రికలలో వచ్చిన కథనాలకు అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతుంది.
Also Read: GHMC: జీహెచ్ఎంసీ బడా మాల్స్‌పై దృష్టి.. మరో వంద నోటీసుల జారీకి ఛాన్స్!
అక్రమార్కులకు వరం..
పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం అక్రమార్కులకు వరంగా మారింది.. సన్న బియ్యం పంపిణీతో సద్దుమణుగుతుందనుకున్న దందా మళ్లీ జడలు విప్పుతోంది.. సన్న బియ్యం నాణ్యత లేకుండా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తినేందుకంటే అమ్ముకునేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు.. దీంతో అక్రమార్కుల చీకటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఏ ప్రభుత్వం ఉన్నా ఈ బియ్యం అక్రమ రవాణాలో పాత్రదారులు మారడంలేదు. మండలాలు, నియోజకవర్గాలుగా పంచుకున్న అక్రమార్కులు అధికార్లకు, నాయకులకు సెటిల్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read; Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

