Heavy Rains: బంగాళకాతంలో అల్పపీడనం ప్రభావం కారణంగా గత కొన్నిరోజులు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగురాష్ట్రాలైన ఆంద్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్ర ఆవేదనకు గురైతున్నారు. వాగులు వంపులు నిండి పొంగిపోర్లుతుండటంతో రైతులు పండించిన పంటలు కొన్ని ప్రాంతాల్లో నేలపాలయ్యాయి. అయితే.. రాబోయే 3 గంటలలో వర్షాలు బంగాళకాతంలోని అల్పపీడనం ప్రభావం తీర ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో కొన్ని జిల్లాలకు వాతవరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది
జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు
దీంతో మధ్య ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిని తెలిపింది. కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ విజయవాడ మరియు గుంటూరు జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. రాఫ్ట్రంలో జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ వైపు ఒకటి రెండు ప్రాంతాలలో కూడా వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవణాలు
ఇటు తెలంగాణలోను వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవణాలు తిరోగమనదిశలో కదులుతున్నందున, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అంకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. నేడు ములుగు, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో కొన్ని జిల్లాల్లో మేడ్చల్, జనగామ, కొత్తగూడెం, ఖమ్మం, నల్గోండ, జయశంకర్ భూపాలపల్లి, సూర్యపేట, హనుమకొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది.
Also Read: Jogulamba Gadwal: ఆ జిల్లాలో మాముళ్ల మత్తులో అధికారులు.. రహదారి పక్కనే సిట్టింగ్‌లు!
