Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలాకాలం అయ్యింది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత తరపున అత్యద్భుత ప్రదర్శన చేసిన షమీ.. ఆ తర్వాత వరుసగా గాయాలపాలయ్యాడు. మడమ, మోకాలి గాయాలకు గురయ్యాడు. మడమకు లండన్‌లో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. అయితే, కోలుకున్నప్పటికీ, ఫిట్‌నెస్ కారణాలను చూపుతూ బీసీసీఐ సెలక్లర్లు షమీని పక్కనపెడుతున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా టూర్‌కు భారత వన్డే జట్టుని సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ, మరోసారి షమీకి నిరాశ కలిగిస్తూ అతడిని ఎంపిక చేయలేదు. దీనిపై మంగళవారం స్పందిస్తూ బీసీసీఐ సెలెక్టర్లపై షమీ విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై ప్రశ్నించాడు.
ఫిట్‌గా ఉన్నాననే కదా అర్థం?
తాను నేను బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్నానంటే, ఫిట్‌గా ఉన్నాననే కదా అర్థమని మహ్మద్ షమీ పేర్కొన్నాడు. ‘‘బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియ టూర్‌కి జట్టుని ప్రకటించినప్పుడు.. షమీ ఫిట్‌నెస్ స్టేటస్‌పై సమాచారం లేదన్నారు. కానీ, ఫిట్‌నెస్ అప్‌డేట్ ఇవ్వడం, అడగడం నా బాధ్యత కాదని నేను భావిస్తున్నాను. ఫిట్‌నెస్ గురించి సెలెక్టర్లకు సమాచారం ఇవ్వడం నా పని కాదు. టీమ్‌లోకి ఎంపిక విషయం నా చేతిలో ఉండదు. దీనిపై ఇప్పటికే క్లారిటీగా చెప్పాను. నాకు ఫిట్‌నెస్ సమస్య ఉంటే, నేను బెంగాల్ తరఫున ఆడుతూ ఉండను కదా?’’ అని తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్తరాఖండ్‌తో బెంగాల్ ఆడనున్న తొలి మ్యాచ్‌కు ముందు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ షమీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Read Also- Venu Swamy puja: తాంత్రిక పూజలు చేస్తూ మరోసారి వైరల్ అయిన వేణు స్వామి .. ఏకిపారేస్తున్న నెటిజన్లు..
‘‘నేషనల్ క్రికెట్ అకాడమీకి (NCA) వెళ్లడం, క్రికెట్ ఆడేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండడం నా పని. ఎవరికి, ఎవరు అప్‌డేట్ ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు అనేది వాళ్ల విషయం. అది నా బాధ్యత కాదు. జాతీయ జట్టుకు అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేయాలని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. ఇది దేశానికి సంబంధించిన విషయం. దేశం గెలవాలి. మనమందరం సంతోషంగా ఉండాలి. నేనెప్పుడూ అదే చెబుతుంటాను. మ్యాచ్‌లు ఆడుతూ ఉండాలి. చక్కగా ప్రదర్శన చేస్తే ఆటగాళ్లకే మేలు. సెలక్టర్లు నన్ను ఎంపిక చేయకపోయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వెళ్లి బెంగాల్ తరఫున ఆడతాను. ఆ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని షమీ ఫుల్ క్లారిటీగా చెప్పాడు.
క్రికెట్ లాంటి ఆటలో ప్రతి ప్లేయర్ స్థిరంగా ఉండలేడని షమీ వ్యాఖ్యానించాడు. నొప్పితో ఆడాలని, జట్టుకు భారం కావాలని తనకు అనిపించదని, శస్త్రచికిత్స తర్వాత బలంగా తిరిగి రావాలనుకున్నాని, అందుకోసమే ప్రయత్నిస్తున్నట్టు షమీ వివరించాడు. ఫైనల్‌గా తన ఎంపిక వ్యవహారంపై మాట్లాడి, వివాదం సృష్టించడాన్ని తాను ఇష్టపడబోనని అన్నాడు. 4 రోజుల మ్యాచ్‌లు (రంజీ ట్రోఫీ) ఆడగలిగితే, 50 ఓవర్ల క్రికెట్‌ను (వన్డేలు) ఎందుకు ఆడలేను? అని మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు షమీ సమాధానం ఇచ్చాడు. త్వరలోనే ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా టూర్‌కు ఎందుకు ఎంపిక చేయలేదనుకుంటున్నారని ప్రశ్నించగా ఈ విధంగా స్పందించాడు.
