Best Smartphones (Image Source: Freepic)
బిజినెస్

Best Smartphones: మెుబైల్ ప్రియులకు పండగే.. రూ.15,000లో తోపు ఫోన్స్ ఇవే.. ఫీచర్స్‌కు ఫిదా కావాల్సిందే!

Best Smartphones: ప్రస్తుతం మార్కెట్ లో రూ.15,000 లోపు చాలా ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వారానికో కొత్త ఫోన్ లాంచ్ అవుతున్న క్రమంలో ఏది కొనాలో అర్థంకాక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. తమ అభిరుచికి, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉన్న మెుబైల్ ఏదో తెలుసుకునేందుకు తెగ కష్టపడుతున్నారు. అటువంటి వారి కోసం ఈ ప్రత్యేక కథనం అందించడం జరిగింది. ఇందులో రూ. 15,000 లోపు మార్కెట్ లో లభిస్తున్న బెస్ట్ కంపెనీ మెుబైల్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ ఫోన్స్ ఏవి? వాటి ఫీచర్స్? ఇప్పుడు చూద్దాం.

1) ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ (Infinix Note 50s)

ఈ మెుబైల్ అడ్వాన్స్ డ్ ఫీచర్లతో మార్కెట్ లో అందుబాటులో ఉంది. 6.78 అంగుళాల Full HD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంది. అలాగే ఫోన్ కు వెనుక భాగంలో 64MP Sony IMX682 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్ MediaTek Dimensity 7300 Ultimate ప్రాసెసర్, Mali-G615 MC2 GPU, 8GB RAM, 128/256GB ROM స్టోరేజ్ కలిగి ఉంది. అదేవిధంగా 45W పవర్ కలిగిన 5500mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. Android 15 ఆధారిత XOS 15, 2 సంవత్సరాల OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు ఈ ఫోన్ కు లభించనున్నాయి.

2) ఐకూ జెడ్ 10ఎక్స్ (iQOO Z10x)

iQOO Z10xలో 6.72 అంగుళాల Full HD+ IPS LCD ప్యానెల్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది. ఇందులో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ను అమర్చారు. 6GB/8GB RAM, 128/256GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. Android 15 ఆధారిత FuntouchOS 15పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్.. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా, 6500mAh బ్యాటరీ సామర్థ్యంతో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను ఫోన్ కలిగి ఉంది.

3) టెక్నో పొవా 7 (Tecno Pova 7)

ఈ మెుబైల్.. 6.78 అంగుళాల Full HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ (HBM) బ్రైట్ నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ పనితీరు విషయానికి వస్తే.. Dimensity 7300 Ultimate ప్రాసెసర్‌తో ఇది నడుస్తుంది. 8GB RAM, 128 జీబీ UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంది. అలాగే 50MP ప్రధాన కెమెరా, సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉంది.

4) ఒప్పొ కె13 (Oppo K13)

ఈ ఫోన్ 6.67 అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. ఇందులో Qualcomm Snapdragon 6 Gen 4 SoC, 8GB RAM, 128/256GB UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. 50MP ప్రధాన కెమెరా, 2MP సెన్సార్.. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ Android 15 ఆధారంగా ColorOS 15పై నడుస్తుంది. కంపెనీ 2 సంవత్సరాల OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ఏకంగా 7,000mAh సామర్థ్యం (iQOO Z10 మెుబైల్ కు ఉన్న 7,300mAh తర్వాత ఇదే రెండో అతిపెద్ద బ్యాటరీ) కలిగిన 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

Also Read: Konda Surekha: నాగార్జున వివాదంతో బాధపడ్డా.. మీడియాతో ఓపెన్‌గా ఉండట్లేదు.. మంత్రి కొండా సురేఖ

5) హనర్ ఎక్స్ 7సి (Honor X7C)

ఈ ఫోన్ 6.8 అంగుళాల Full HD+ TFT LCD డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, Android 14 ఆధారిత MagicOS 8.0 సాఫ్ట్ వేర్, 35W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

Also Read: Pak vs Afghan War: పాక్-అఫ్గాన్ మధ్య ఎందుకు చెడింది.. ఘర్షణలకు కారణమేంటి.. దీని వెనుక భారత్ ఉందా?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!