Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha).. ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన చిట్ చాట్ లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడారం టెండర్ల విషయంలో తలెత్తిన వివాదం, హీరో నాగార్జునతో విభేదాలు గురించి ప్రస్తావించారు. తనకు ఓపెన్ గా మాట్లాడటం అలవాటని ఏదీ దాచిపెట్టలేనని పేర్కొన్నారు.
‘మంత్రిగా నా కోరిక అదే’
మేడారం టెండర్ల విషయంలో తనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మంత్రిగా తన శాఖ పనులు పారదర్శకంగా ఉండాలనేదే తన కోరిక అని పేర్కొన్నారు. ‘మేడారం పనుల కోసం 3 ప్రధాన కంపెనీలు టెండర్లు వేశాయి. అందులో ఎవరి ఎలిజిబిలిటీ వారిది. మంత్రిగా నాకు, నా శాఖ కార్యదర్శికి ప్రతీ విషయం నోటీసులో ఉండాలనేదే నా ఉద్దేశం. పనులు వేగంగా జరగాలన్నదే మంత్రిగా నాది, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కోరిక. మేడారం పనులపై మంత్రి పొంగులేటిని సీఎం ఫోకస్ చేయమన్నారు’ అని సురేఖ అన్నారు.
నాగార్జున వివాదంపై..
ప్రతీ విషయం ఓపెన్ గా మాట్లాడటం తనకు అలవాటని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఏదీ దాచిపెట్టకుండా మాట్లాడేస్తానని చెప్పారు. అయితే నటుడు నాగార్జున (Actor Nagarjun) విషయంలో తాను మాట్లాడింది వేరని.. దాన్ని వివాదంగా చిత్రీకరించిన తీరు వేరని పేర్కొన్నారు. ఆ ఘటనతో తాను మనస్థాపం చెందానన్న మంత్రి.. అందుకే మీడియాతో ఓపెన్ గా ఉండటం లేదని అన్నారు. మరోవైపు కొండా దంపతుల ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొందరు రెడ్లు లాబీయింగ్ చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. తాను ఏది ఉన్నా పార్టీ అధిష్టానానికి నేరుగా చెప్పి రాజకీయాలు చేస్తానని స్పష్టం చేశారు.
Also Read: Pak vs Afghan War: పాక్-అఫ్గాన్ మధ్య ఎందుకు చెడింది.. ఘర్షణలకు కారణమేంటి.. దీని వెనుక భారత్ ఉందా?
‘నా బాధ్యతలు నాకు తెలుసు’
ఎవరినో, ఏదో చేయాలని తాను దిల్లీ, హైదరాబాద్ లో ప్రత్యేక లాబీయింగ్ చేయనని కొండ సురేఖ పేర్కొన్నారు. ఆ అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. తాను మంత్రిగా ఏ పని చేసినా కొందరు వివాదం చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. అందుకే మౌనంగా తన శాఖ పనులు తాను చేసుకుపోతున్నట్లు చెప్పారు. ‘ఎవరు ఏం అనుకున్నా కేబినెట్ మంత్రిగా నా బాధ్యతలు నాకు తెలుసు’ అంటూ మీడియా చిట్ చాట్ లో కొండ సురేఖ చెప్పుకొచ్చారు.
