Seethakka: మేడారం చరిత్రలో నిలిచిపోయేలా సాగుతున్న పనులు
Seethakka (IMAGE CREDIT: twitter)
నార్త్ తెలంగాణ

Seethakka: మేడారం చరిత్రలో నిలిచిపోయేలా సాగుతున్న పనులు.. మంత్రి సీతక్క వెల్లడి!

Seethakka: రానున్న మేడారం మహా జాతరలో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణ పనులను కొనసాగిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. తాడ్వాయి మండలంలోని మేడారంలో సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద ఆమె ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని తెలిపారు.

Also  Read: Seethakka: కొమరం భీం స్ఫూర్తితో గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటు.. సీతక్క కీలక వ్యాఖ్యలు

పనులు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయేలా? 

గద్దెల ప్రాంగణాన్ని విస్తరించి, అద్భుతంగా గుడిని అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన దర్శనాన్ని, సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో సీఎం చర్యలు చేపడుతున్నారన్నారు. వారం క్రితమే మేడారం అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, సీఎం ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మేడారం పునర్నిర్మాణ పనులు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయేలా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ గుడి అభివృద్ధిలో తనకు భాగస్వామ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

 ఏ చిన్న సమస్య లేకుండా గుడి నిర్మాణాన్ని విజయవంతం

ఈ జన్మకు ఇది గొప్ప అవకాశం’గా భావిస్తున్నానని సీతక్క పేర్కొన్నారు. ఎవరి విమర్శలు చేసినా మేడారాన్ని సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. తనకు జన్మనిచ్చింది సమ్మక్క కాగా, పునర్జన్మనిచ్చింది మాత్రం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులని అన్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది సమ్మక్క, సారలమ్మ, ములుగు ప్రాంత ప్రజలేనని చెప్పారు. తల్లుల సేవలో, ప్రజాసేవలో ఎల్లప్పుడు తరించిపోతానని, తల్లుల గొప్ప కీర్తిని ఏ మాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత తనదేనని తెలిపారు. ఏ చిన్న సమస్య లేకుండా గుడి నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. జాతర రాకముందే పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారని సీతక్క చెప్పారు.

Also Read:Seethakka: బీసీల‌కు 42 శాతం రిజర్వేష‌న్లు క‌ల్పించాం.. సీత‌క్క కీలక వ్యాఖలు  

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!