Seethakka: కొమరం భీం పోరాటం ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం అని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. కొమరం భీం (Komaram Bheem) వర్ధంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్ పై న భీం విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి మాట్లాడారు. కొమరం భీం ఆశయాలను సాధిస్తామన్నారు. మా గుడాల్లో మా రాజ్యం కావాలని మా ఆడవుల మీద మాకు హక్కు ఉండాలని పోరాటం చేసిన వ్యక్తి కొమరం భీం (Komaram Bheem) అని కొనియాడారు. జల్ జంగల్ జమీన్ పైబాధాకరం ఆదివాసులకు ఉండాలని పోరాటం చేశారన్నారు. భీం పోరాటాల ఫలితంగానే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, తొలి ప్రధాని నెహ్రూ దివాసి గిరిజనులకు రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణచట్టాలు కల్పించారన్నారు.
Also Read: Srinidhi Shetty : వారి కోసం 24 గంటలు ఆ పని చేస్తా.. శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
కొమరం భీం స్ఫూర్తితో గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటు
కొమరం భీం స్ఫూర్తితో గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటు అయ్యిందన్నారు. రాజ్యాంగంలో ఈశాన్య రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారన్నారు. మైదాన ప్రాంత రాష్ట్రాల్లోని ఆదివాసీల పరిరక్షణ కోసం షెడ్యూల్ 5 ను రాజ్యాంగంలో చేర్చారని, ఐటీడీఏ లో ఏర్పాటులోనూ కొమరం భీం స్ఫూర్తి ఉందన్నారు. ఆదివాసీల అభివృద్ధి తోనే కొమరం భీమా ఆశయాలు నెరవేరుతాయన్నారు. గిరిజన ఆదివాసిల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ఉద్యోగాల భర్తీ లోను ఆదివాసి గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించామన్నారు.
జల్ జంగల్ జమీన్ పోరాటాలు
ఏజెన్సీ ఏరియాలో ఆదివాసి గిరిజనులకు ఉద్యోగాలు కల్పించేందుకు జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామన్నారు. అందరికీ భూములు ఇండ్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే కొమరం భీం ఆశయాలను సాధించిన వాళ్ళమవుతామన్నారు. తెలంగాణ ఉద్యమ నినాదం కూడా నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. అంతకుముందే జల్ జంగల్ జమీన్ పోరాటాలు చేశారని, ఆ స్ఫూర్తితోనే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం సాగిందన్నారు. కేవలం సంబరాలు చేసుకుంటే సరిపోదని వారి త్యాగాలను గుర్తు చేసుకొని వారి స్ఫూర్తిని ముందు తరాలకు అందజేయాలని పిలుపు నిచ్చారు.
Also Read: Lik movie postponed: రిలీజ్ వాయిదా పడిన ప్రదీప్ రంగనాధన్ సినిమా.. ఎందుకంటే?
