Seethakka: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కేటాయింపును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ ను కొట్టి వేయడంపై మంత్రి సీతక్క(Seethakka) హర్షం వ్యక్తం చేశారు. హై కోర్టులో సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్ద పీట వేస్తోందన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు విద్య ఉపాధి, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లులు పాస్ చేశామన్నారు. కానీ గవర్నర్, రాష్ట్రపతి వద్ద ఆ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.
Also Read: Gold Rate Today: అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఎంత పెరిగిందంటే?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
గత రెండు నెలలుగా పంచాయతీలకు ఎన్నికలు జరక్కపోవడంతో..నిధుల సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కేంద్రం నుంచి నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందన్నారు. అయితే కొందరు వ్యక్తులు దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించారనిమండిపడ్డారు. సుప్రీం కోర్టు ఆ పిటిషన్లను కొట్టేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.హైకోర్టు లో విచారణ ఉందని, హైకోర్టు సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. గత నోటిఫికేషన్ కు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.
జస్టిస్ గవాయిపై దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై జరిగిన దాడి ఘటనపై మంత్రి సీతక్క((Seethakka) )తీవ్రంగా ఖండించారు. ఇది క్షణికావేశంలో జరిగిన దాడి కాదని, పథకం ప్రకారం కుట్రపూరితంగా చేసిన దాడి అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు భారత రాజ్యాంగానికి కస్డోడియన్ అని, దాని ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అంటే రాజ్యాంగంపై దాడి చేసినట్టే అని ఆమె పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, దానిపై దాడి చేయడం భారత ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులు దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం మన అందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలను ప్రసాదించిందని, ఆ విలువలను కాపాడడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఆమె పిలుపునిచ్చారు.
Also Read: King100: కింగ్ నాగార్జున 100వ చిత్రానికి క్లాప్ పడింది.. దర్శకుడు ఎవరంటే?
