Hero Prabhas Role Not Revealed In Kannappa Teaser
Cinema

Kannappa Movie: నిరాశలో ఫ్యాన్స్, ఎందుకంటే..?

Hero Prabhas Role Not Revealed In Kannappa Teaser: టాలీవుడ్ మూవీ కన్నప్ప టీజర్ బయటికి వచ్చింది. టీజర్ రెస్పాన్స్ పక్కన పెడితే.. ఈ టీజర్‌పై ఫ్యాన్స్‌ అందరి ఫోకస్‌ పడటానికి మెయిన్‌ రీజన్ ప్రభాస్. ఇందులో ప్రభాస్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రభాస్ కన్నప్పలో చేరిన తర్వాతే మూవీ చుట్టూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. టీజర్‌లో ఖచ్చితంగా ప్రభాస్ మ్యాజిక్ ఉంటుందని ఫ్యాన్స్ అందరూ భావించారు. కానీ విష్ణు థాట్స్‌కి మాత్రం మరోలా ఉంది.

అసలు టీజర్‌లో ప్రభాస్‌ని రివిల్ చేయలేదు. ఎందుకంటే ఫ్యాన్స్‌కి రివీల్ చేయకుండా ఉంటేనే ఇంకా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ని ఇంకా కొనసాగించడం విష్ణు ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. కానీ ప్రభాస్‌ని వాడే విధానం ఇది కాదనే వాదనలు నెటిజన్స్ నుండి వినిపిస్తున్నాయి. టీజర్ ఇండెక్స్ అఫ్ ది మూవీ. సినిమాపై బజ్ క్రియేట్ చేయాల్సింది టీజరే. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఉన్నప్పుడు ఒక్క షాట్ అయినా చూపించి ఉంటే బజ్ వేరే లెవల్‌లో ఉండేదని వారంతా భావిస్తున్నారు.

Also Read: వారిని చూసి షాకయ్యానంటున్న నటి

అంతేకాదు ప్రభాస్ కనిపిస్తే ఈ మూవీపై ఫ్యాన్స్‌కి పాజిటివిటి పెరిగి, ఈ మూవీ ఇంకా బలంగా నలుమూలాల చొచ్చుకు వెళ్ళేది. కానీ ఎందుకో విష్ణు ఈ ఛాన్స్‌ని అస్సలు వాడుకోలేదనే కొంతమంది ఫ్యాన్స్ టాక్‌. బహుశా ప్రభాస్ కోసం ఓ స్పెషల్ ఈవెంట్ పెట్టి ఆయన క్యారెక్టర్ రివిల్ చేసే ఆలోచనలో ఉన్నారేమో అంటూ మరికొందరు అనుకుంటున్నారు. ఏదేమైనా టీజర్‌లో డార్లింగ్ ప్రభాస్ కనిపించకపోవడం ఫ్యాన్స్‌ని కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి.

Just In

01

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ