Actress Kritikharbanda Shocking Comments About Public
Cinema

Actress Shocked: వారిని చూసి షాకయ్యానంటున్న నటి

Actress Kritikharbanda Shocking Comments About Public: టాలీవుడ్‌ మూవీ బోణీ ద్వారా తెలుగు చిత్రసీమకు హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది అందాల తార కృతి కర్బందా. ఈ అమ్మడు మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ల సుదీర్ఘ కాల సినీ కెరీర్‌లో ఈ అమ్మడు పలు సినిమాల్లో యాక్ట్ చేయగా అందులో కొన్ని నిరాశపరచగా మరికొన్ని హిట్‌గా నిలిచాయి. తాజాగా తన సినీ కెరీర్ 15 ఇయర్స్ పూర్తి చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇన్నాళ్ల తన సినీ కెరీర్‌ చాలా సంతృప్తిగా సాగిందని చెప్పుకొచ్చింది. నా జీవితంలో నేను నటిగానే ఎక్కువ కాలం గడిపాను అని పేర్కొంది. కన్నడలో నేను మొదటగా చేసిన గూగ్లీ మూవీలో డాక్టర్ స్వాతిగా కనిపించాను. ఆ మూవీ రిలీజ్ తర్వాత ఒక రోజు షాపింగ్‌కు వెళ్లాను. అక్కడ కొంత మంది నన్ను గుర్తుపట్టి డాక్టర్‌,డాక్టర్.. అంటూ పిలిచారు. వారు డాక్టర్ స్వాతి అంటూ నన్ను గుర్తుపట్టడంతో షాక్ అయ్యాను. అప్పుడే హీరోయిన్స్‌కి, సినిమా వారికి ఎంతటి క్రేజ్ ఉంటుంది, ఇండస్ట్రీలో ఉంటే ఎలా జనాలు చూస్తారు అనేది అర్థం అయ్యింది. నా సినీ కెరీర్‌లో భాగస్వామ్యులు అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు.

Also Read: అన్‌ఫాలోపై నటి కామెంట్

నాకు మంచి పాత్రలు ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. టాలీవుడ్‌లో ఈ అమ్మడు పవన్‌ కల్యాణ్‌కు జోడీగా తీన్మార్ మూవీతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటించింది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి ఆఫర్లు తెలుగులో ఎక్కువగా రాలేదు. అయినా కూడా కెరీర్‌లో ఈ అమ్మడు బ్రేకుల్లేకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ వచ్చింది. మరో 15 ఏళ్ల పాటు ఈ అమ్మడి కెరీర్ కొనసాగించే ఛాన్స్‌లు ఉన్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!