Unfollow Effect | అన్‌ఫాలోపై నటి ఇంట్ర కామెంట్
Actress Niharika Konidela Comments About Saidharamtej Allu Arjun
Cinema

Unfollow Effect: అన్‌ఫాలోపై నటి కామెంట్

Actress Niharika Konidela Comments About Saidharamtej Allu Arjun: ఏపీ ఎలక్షన్స్‌ రిజల్ట్స్ వచ్చిన కొన్ని గంటల్లోనే అనూహ్య సంఘటన జరిగింది. మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ తీసుకున్న నిర్ణయంతో మెగా ఫ్యాన్స్ షాక్‌కి గురి అయ్యారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను సోషల్‌ మీడియాలో సాయిధరమ్ తేజ్ అన్‌ఫాలో చేశారు. దీంతో మెగా వర్సెస్‌ అల్లు అంటూ నెట్టింట చర్చ నడుస్తోంది.

అయితే సాయి ధరమ్‌ తేజ్‌ తప్ప.. మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్‌ను ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ వివాదం గురించి మెగా బ్రదర్ కూతురు నిహారిక రియాక్ట్‌ అయింది. కమిటీ కుర్రోళ్లు అనే సినిమా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమానికి హాజరైన నిహారికను ఇదే మ్యాటర్ గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఆమె స్పందించింది. అల్లు అర్జున్‌, సాయిదుర్గ తేజ్‌ విషయం గురించి తనకు ఇంకా తెలియదని చెప్పింది. అయినా, ఎవరి రీజన్స్ వారికి ఉంటాయని ఆమె చెప్పింది. కొత్త నటులను ఇంట్రడ్యూజ్ చేస్తూ కమిటీ కుర్రోళ్లు అనే మూవీని నిహారిక సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read: రాబిన్‌ హుడ్ గ్లింప్స్‌ అదుర్స్

తాజాగా ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఫ్రోగ్రాం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ మూవీ ద్వారా 11 మంది టాలెంటెడ్ ఆర్టిస్టులను టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నట్లు మూవీ డైరెక్టర్‌ యధు వంశీ తెలిపాడు. ఈ మూవీ గురించి నిహారిక మాట్లాడుతూ.. తామంతా ఓ ఫ్యామిలీలా కష్టపడి మూవీని తెరకెక్కించామని తెలిపింది. ఈ మూవీలోని ఎమోషన్స్‌కు అందరూ కనెక్ట్‌ అవుతారని ఆమె తెలిపింది. త్వరలో కమిటీ కుర్రోళ్లు ట్రైలర్‌ రిలీజ్ చేస్తామని నిహారిక పేర్కొంది.

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం