Amit-Shah
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Muslim Population: దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల వెనుక అసలు కారణం ఇదేనా?

Muslim Population: భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో జనాభా లెక్కలకు చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. ఆర్థిక ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలులో ఈ గణాంకాలు చాలా చాలా ముఖ్యం. సామాజిక వర్గాలు, మతాల వారీ గణాంకాలకు కూడా విశిష్ట ప్రాధాన్యత ఉంది. అయితే, దేశంలో మతపరంగా జనాభాలో చోటుచేసుకుంటున్న మార్పులపై కేంద్ర హోమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రెండు రోజులక్రితం న్యూఢిల్లీలో ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ప్రత్యేక సెషన్‌లో మాట్లాడుతూ, స్వాతంత్ర్య వచ్చిన తర్వాత దేశంలో ముస్లిం జనాభా (Muslim Population) 24 శాతం మేర పెరిగిందని వ్యాఖ్యానించారు. అయితే, ముస్లిం జనాభా ఇంతలా పెరగడానికి జనన రేటు కారణం కాదని, దేశంలోకి అక్రమ చొరబాట్లు కారణమని అమిత్ షా చెప్పారు.

జనాభా లెక్కల డేటా ఇదే

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత  1951, 1961, 1971, 1981, 1991, 2001, 2011 సంవత్సరాలలో జనగణనలు జరిగాయి. మొదటిసారి నుంచి మత ఆధారిత డేటాను సమీకరిస్తున్నారు. 1951 జనాభా లెక్కల ప్రకారం, హిందూ జనాభా 84 శాతం, ముస్లింలు 9.8 శాతంగా ఉంది. అయితే, 1971 నాటికి హిందూ జనాభా 82 శాతానికి తగ్గి, ముస్లిం జనాభా 11 శాతానికి పెరిగింది. ఇక, 1991లో హిందూ జనాభా స్వలంగా తగ్గి 81 శాతానికి పడిపోగా, ముస్లింలు 12.2 శాతానికి చేరింది. చివరిసారిగా చేపట్టిన 2011 జనాల లెక్కల ప్రకారం హిందూ జనాభా 79 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో ముస్లిం జనాభా 14.2 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Read Also- Railways Update: జర్నీ ప్లాన్ చేసుకున్నారా?.. ఎందుకైనా మంచిది రైల్వే శాఖ ఇచ్చిన ఈ అప్‌‌డేట్ తెలుసుకోండి

అమిత్ షా క్లియర్ కట్ మెసేజ్

భారతదేశంలో అక్రమంగా వలస వచ్చినవారి సంఖ్య క్రమంగా, వేగంగా పెరిగిపోతోందనేది అమిత్ షా వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. తద్వారా  శరణార్థులను, దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారిని ఒకేవిధంగా పరిగణించలేమని అమిత్ షా స్పష్టమైన సందేశం ఇచ్చారు. అక్రమంగా వలస వచ్చినవారిని గుర్తించి పంపించివేస్తామని హెచ్చరించారు. ‘చొరబాట్లు, జనాభా సంఖ్యలో మార్పు- ప్రజాస్వామ్యం అనే అంశంపై మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, దేశ భద్రతలో అక్రమ చొరబాట్లు, జనాభా పెరుగుదల, ప్రజాస్వామ్యం ఈ మూడు చాలా ముఖ్యమైన అంశాలు. దేశ సంస్కృతి, భాషలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అయితే, సరిహద్దులో భద్రతా బలగాలు కంటి మీద కనుకువేయకుండా కాపాలా కాస్తున్నా ఈ స్థాయిలో చొరబాట్లు పెరుగుతున్నాయా? అనే సందేహాలు అమిత్ షా వ్యాఖ్యలను బట్టి అనిపిస్తోంది.

భారత ఉపఖండ జనాభాలో మార్పు!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరో కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో హిందువుల పరిస్థితిని గురించి మాట్లాడారు. ‘‘1951లో పాకిస్థాన్‌లో హిందూ జనాభా 13 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది కేవలం 1.73 శాతానికి తగ్గిపోయింది. బంగ్లాదేశ్‌లో 1951లో హిందువులు 22 శాతం ఉండగా, ఇప్పుడు అది 7.9 శాతానికి తగ్గిపోయారు. అఫ్గానిస్థాన్‌లో అప్పట్లో హిందూ, సిక్కులు కలిపి 2.2 లక్షల మంది ఉండేవారు. ఇప్పుడు కేవలం 150 మంది మాత్రమే మిగిలారు’’ అని అమిత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత ఉపఖండంలో జనాభా పెరుగుదల ట్రెండ్‌ను తెలియజేస్తున్నాయా? అనే భావన కలుగుతోంది. అటు పాకిస్థాన్, ఇటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలతో పాటు ఇటు భారతదేశంలో కూడా ముస్లింల జనాభా గణనీయంగా పెరుగుతోందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

Read Also- Etela Rajender: ఆ నియోజకవర్గంలో స్థానిక సంస్థల బీఫాంలపై.. ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!