Railways Update: రైల్వే ప్రయాణికులకు శుభవార్తలు మాత్రమే కాదు, కొన్నిసార్లు ముఖ్యమైన అప్డేట్స్ (Railways Update) కూడా వస్తుంటాయి. టికెట్ రిజర్వేషన్లలో మార్పులు, కొత్త సేవలతో పాటు రైళ్ల సమయాల్లో మార్పులు, కొన్ని సర్వీసులు రద్దు, లేదా ఆలస్యం వంటి ముఖ్యమైన ప్రకటనలు వెలువడుతుంటాయి. ఇలాంటి అప్‌డేట్స్ పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ఒక్క చిన్న సమాచారం తెలియకపోవడం వల్ల ప్రయాణ షెడ్యూల్ తలకిందులయ్యే ముప్పు ఉంటుంది. అందుకే, రైల్వే జర్నీకి ముందు అప్డేట్స్ తెలుసుకోవడం మంచిది. అలాంటి కీలకమైన అప్‌డేట్ ఒకటి తాజాగా వచ్చింది.
రానున్న కొన్ని రోజులపాటు గోరఖ్‌పూర్ జంక్షన్ గుండా వెళ్లే కొన్ని రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఇదే మార్గంలో పయనించే మరికొన్ని సర్వీసులను షార్ట్-టర్మినేట్ చేస్తున్నట్టు వెల్లడించింది. అంటే, రైళ్లు చివరి స్టేషన్ వరకు వెళ్లకుండానే నిర్దిష్ట స్టేషన్ వరకు మాత్రమే సర్వీసులను కుదిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. గోరఖ్‌పూర్ జంక్షన్‌కు సమీపంలో చేపడుతున్న ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రయాణికుల భద్రతస భవిష్యత్తులో రైలు ప్రయాణాలు నిరంతరాయంగా, సాఫీగా కొనసాగడానికి వీలుగా మరమ్మతు పనులు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. కాబట్టి, సంబంధిత వివరాలను జాగ్రత్తగా పరిశీలించి ప్రయాణ షెడ్యూల్‌ను ఖరారు చేసుకోవాలని అధికారులు సూచించారు.
రద్దు అయిన ట్రైన్స్ లిస్ట్ ఇదే
గోరఖ్‌పూర్ జంక్షన్ మార్గంలో వెళ్లే రైలు సర్వీసులు ఎన్ని రోజులపాటు ప్రభావితం అవుతాయో అధికారులు వెల్లడించలేదు. కానీ, రద్దు కాబోతున్న, షార్ట్-టెర్మినేట్ చేస్తున్న ముఖ్యమైన కొన్ని రైళ్ల వివరాలను మాత్రం వెల్లడించారు. మరమ్మతు పనుల కారణంగా ప్రభావితం కానున్న రైళ్లు జాబితాలో గోరఖ్‌పూర్ – బాద్‌షానగర్ ప్యాసింజర్ (15009/15010 ), గోరఖ్‌పూర్ – బలరామ్‌పూర్ ప్యాసింజర్ (15015/15016 ), గోరఖ్‌పూర్ – బస్తీ ప్యాసింజర్ (15017/15018 ), గోరఖ్‌పూర్ – డియోరియా ప్యాసింజర్ (15019/15020), గోరఖ్‌పూర్ – గోండా ప్యాసింజర్ (75005/75006) ఉన్నాయి.
Read Also- IT Industry Jobs: టెక్ ఇండస్ట్రీలో షాకింగ్ ట్రెండ్.. టెకీలకు మింగుడుపడని వాస్తవం చెప్పిన టీసీఎస్
అయితే, ఏ రైలు రద్దయింది, ఏ సర్వీసుని కుదిస్తున్నారు, ఏయే తేదీల్లో ఈ మార్పులు ఉంటాయనే విషయాన్ని ఇండియన్ రైల్వేస్ అధికారిక వెబ్‌సైట్, లేదా యాప్‌లో చూసుకోవాలని అధికారులు సూచించారు. ఏ తేదీ వరకు ఈ సర్వీసులు ప్రభావితం అవుతాయనేది వెల్లడించలేదు. అయితే, కొన్ని రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు ఇదే విధంగా కొనసాగే ఛాన్స్ ఉంది. పూర్తిస్థాయిలో సేవలు పున:ప్రారంభమయ్యే తేదీలు, మార్పుల వివరాలను అధికారులు ముందుగానే ప్రకటించనున్నారు.
కాబట్టి, ఈ మార్గాల్లో రైలు ప్రయాణాలు చేసేవారు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను తెలుసుకొని జర్నీలను షెడ్యూల్ చేసుకోవడం ఉత్తమం. స్టేషన్‌కు వెళ్లడానికి ముందే ట్రైన్ స్టేటస్‌లను తెలుసుకోవడం ఉత్తమం. రైల్వ అధికారిక వెబ్‌సైట్లు, లేదా ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై వివరాలను తెలుసుకోవచ్చు. కాగా, ట్రాక్ మరమ్మతులు, భద్రతా కారణాలు, లేదా నిర్వహణ సమస్యల కారణంగా రైళ్లను రద్దు చేయడం, లేదా సర్వీసుల్లో మార్పులు చేయడం సాధారణ విషయమే. ఇలాంటి మార్పులు ఏమైనా ఉంటే, అధికారులు ముందే అప్రమత్తం చేస్తుంటారు.
Read Also- Manchu Lakshmi controversy: మంచు లక్ష్మికి క్షమాపణలు చెప్పిన సీనియర్ జర్నలిస్ట్.. ఎందుకంటే?
