Manchu Lakshmi controversy: మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో, మోహన్ బాబు (Mohan Babu) ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘దక్ష’ (Daksha). ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ప్రముఖ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేసే క్రమంలో తనను చాలా ఇబ్బంది పెట్టాడని అతనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు చేసింది. తాజాగా దీనికి సంబంధించి ఆ ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ జర్నలిస్ట్ స్పందించారు. ఏం అన్నారంటే.. ఇటీవల మంచు లక్ష్మి తో చేసిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు ఆమెను అడగాల్సి వచ్చింది. ఆ క్రమంలో అడిగిన ప్రశ్నలు ఆమెను ఇబ్బంది పెట్టి ఉంటాయన్న విషయం నాకు తెలీదు. ఈ విషయం చాలా లేటుగా నా దగ్గరకు వచ్చింది. దీనికి సంబంధించిన వివరణను యూనియన్ వారు నా దగ్గరకు తెచ్చారు. ఏది ఏమైనా అప్పుడు అడిగిన ప్రశ్నలు ఇబ్బంది పెట్టి ఉంటే బే షరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ఇంతటితో ఈ వివాదం ముగుస్తుందని ఆసిస్తున్నాను’ అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆడవారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేసినందుకు అప్పుడు ఆ సినీ జర్నలిస్ట్ పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. తాజాగా పెట్టిన వీడియోతో వివాదం ముగుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
Read also-Diwali movie releases: దీపావళికి థియేటర్లలో పేలనున్న ధమాకా సినిమాలు.. ఏంటంటే?
దీనిపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. ఒక వ్యక్తి నుంచి క్షమాపణ పొందడానికి నాకు మూడు వారాలు పట్టింది. నేను ఈ సారి మౌనంగా ఉండాలని అనుకోలేదు. ఎందుకంటే నా కోసం నేను నిలబడకపోతే, నా తరఫున ఎవరూ నిలబడరని నాకు తెలుసు. ఈ అనుభవం నన్ను లోతుగా గాయపరిచింది. నాకు కావల్సింది కేవలం ఒక నిజమైన క్షమాపణ, బాధ్యతను స్వీకరించడం మాత్రమే. ఇలాంటి చిన్న చిన్న ప్రతిఘటనలే ఆడవాళ్ళ గొంతుని మూగబోకుండా కాపాడుతాయి. నాకంటే ముందు ధైర్యం గా మాట్లాడిన ఆడవాళ్ల వరుసలోనే నేనూ నిలబడి ఉన్నాను.. వారి ధైర్యమే నాకు ఈ రోజు బలాన్నిస్తుంది. పత్రికా రంగం వృత్తిపై నాకు చాలా గౌరవం ఉంది. ప్రజలకు నిజం తెలియజేయడంలో ప్రాణం పెట్టే జర్నలిస్టులు ఈ సమాజానికి వెలుగు చూపే దీపాల్లాంటి వారు. కానీ ఆ శక్తిని సార్థకమైన సంభాషణల కంటే వ్యక్తిగత దాడుల కోసం వాడినప్పుడు, అది ఎంతో బాధని కలిగిస్తుంది. నేను ఇంక ఈ విషయాన్ని ప్రశాంతంగా ముగిస్తున్నాను. ఇకపైన కూడా ఆత్మగౌరవంతో నడవబోతున్నాను.. నిజాయితీతో తన కథని వినిపించే ప్రతి మహిళకు గౌరవం తెలియజేస్తూ’ అంటూ తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు.
Read also-Kiran Abbavaram: తెలుగు హీరోలకు తమిళనాడులో థియేటర్లు దొరకవా?.. ఆ హీరో చెప్పింది నిజమేనా?
‘‘నాలుగేళ్లకు పైగా విరామం తర్వాత, నేను నిర్మించి, మా నాన్నగారు, లెజెండరీ మోహన్ బాబుతో కలిసి నటించిన ఒక సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చాను. గౌరవపూర్వకంగా, మేము సదరు జర్నలిస్ట్‌కు రోజులో మొదటి ఇంటర్వ్యూ స్లాట్ ఇచ్చాము. దురదృష్టవశాత్తు, అక్కడ జరిగింది ఇంటర్వ్యూ కాదు, నాపై దాడి. సినిమా గురించి, అందులో ఉన్న కళ గురించి, ఈ ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకురావడానికి పడిన అపారమైన కృషి గురించి మాట్లాడటానికి బదులుగా.. ఆయన నా వయస్సు, శరీరం, నేను వేసుకునే దుస్తులను లక్ష్యంగా చేసుకుని కించపరిచారు. అసంబద్ధమైన మాటలెన్నో మాట్లాడారు. ఆయన ప్రశ్నల ఉద్దేశ్యం నా పనిని అర్థం చేసుకోవడం కాదు.. కేవలం రెచ్చగొట్టడం, కించపరచడం, నన్ను చిన్నబుచ్చడం మాత్రమే. అంటూ మంచు లక్ష్మి ప్రముఖ సీనియర్ జర్నలిస్టుపై ఫిరాదు చేశారు. ఇది కాస్త అప్పుడు వైరల్ గా మారింది.
ఒక వ్యక్తి నుంచి క్షమాపణ పొందడానికి నాకు మూడు వారాలు పట్టింది. నేను ఈ సారి మౌనంగా ఉండాలని అనుకోలేదు. ఎందుకంటే నా కోసం నేను నిలబడకపోతే, నా తరఫున ఎవరూ నిలబడరని నాకు తెలుసు. ఈ అనుభవం నన్ను లోతుగా గాయపరిచింది. నాకు కావల్సింది కేవలం ఒక నిజమైన క్షమాపణ, బాధ్యతను స్వీకరించడం మాత్రమే.… pic.twitter.com/B4N6dEEpYS
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) October 10, 2025
