tollywood( images :X)
ఎంటర్‌టైన్మెంట్

Kiran Abbavaram: తెలుగు హీరోలకు తమిళనాడులో థియేటర్లు దొరకవా?.. ఆ హీరో చెప్పింది నిజమేనా?

Kiran Abbavaram: తెలుగులో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ‘రాజా వారు రాణివారు’ సినిమాతో ఆరంగేట్రం చేసిన ఈ నటులు కాంట్రవర్సీలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. అయితే ఆయన తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ తెలుగు, తమిళ ఇండస్ట్రీల మధ్య చిచ్చురేపుతున్నాయి. ‘తమిళ హీరోలకు తెలుగులో థియేటర్లు దొరుకుతాయి కానీ తెలుగు హీరోలకు తమిళంలో థియేటర్లు దొరకవు. తమిళులు తెలుగు సినిమాలను అక్కడ విడుదల చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంలేదు. వారు తెలుగు వారిపై వివక్ష చూపుతున్నారు.’ అంటూ కిరణ్ అబ్బవం చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే ఆయన చెప్పింది నిజమేనా? తెలుగు హీరోలకు థియేటర్లు ఇవ్వడంలో అక్కడి వారు ఇబ్బంది పెడతారా?

Read also-Tollywood Heroes: టాలీవుడ్ హీరోల మల్టీప్లెక్స్ బిజినెస్ వెనుక ఇంత కథ ఉందా?

సినీ పెద్దలు చెప్పినట్లు కళ అనేది కలిపేది, విడగొట్టేది కాదు. నిజంగా తెలుగు హీరోలకు థియేటర్లు ఇవ్వకపోతే కొన్ని సినిమాలు అంత భారీ మొత్తాల్లో కలెక్షన్లు వచ్చేవి కావు. భాస్ తమిళ మార్కెట్‌లో కింగ్. ‘బాహుబలి 2’ రూ.153 కోట్లు, ‘బాహుబలి 1’ రూ.75 కోట్లతో రికార్డులు సృష్టిచడు. ‘సలార్’ రూ.19.8 కోట్లు, ‘సాహో’ రూ.12.2 కోట్లు, ‘కల్కి 2898 ఏడి’ రూ.43.5 కోట్లు . 2025లో విడుదలైన ‘మిరాయ్’ తమిళలో రూ.15-20 కోట్లు సాధించింది.. ప్రభాస్ ఇమేజ్ ఇక్కడ బలంగా ఉంది. అల్లు అర్జున్ ‘పుష్ప్’ సిరీస్‌తో తమిళుల్లో సూపర్‌స్టార్. ‘పుష్ప్: ది రైజ్’ రూ.30 కోట్లు, ‘పుష్ప్ 2: ది రూల్’ రూ.75.6 కోట్లతో రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది. మహేష్ బాబు ‘స్పైడర్’తో రూ.25 కోట్లు. ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’తో రూ.80 కోట్లు. 2024లో ‘దేవర’ తమిళనాడులో రూ.9-11 కోట్లు సాధించింది. అయితే ఈ సినిమాలకు థియోటర్లు దొరక్కపోతే ఇన్ని కోట్లు కలెక్షన్లు రావు.

Read also-Rishab Pragathi: రిష‌బ్‌ శెట్టి – ప్రగతి లవ్ స్టోరీ వెనుక ఉన్నదెవరంటే?

దీనిపై ఒక ప్రముఖ నిర్మాతలు వివరణ అడగ్గా.. ‘అలాంటిది ఏం ఉండదు. మంచి సినిమా తీసిన వాడికి ఇండస్ట్రీతో పనిలేదు. కథలో దమ్ము ఉంటే ఎక్కడ అయినా ఆడుతుంది. అలాంటి మంచి సినిమాలు తీయండి ఎందుకు ఆడవు, ఎందుకు ఇవ్వురు థియేటర్లు’అంటూ చెప్పుకొచ్చారు. అయితే థియేటర్లు ఇవ్వక పోవడానికి చాలా కారణాలు ఉంటాయి. తమిళనాడులో తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే థియేటర్లు చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ దాదాపు 1600 వరకూ ఉంటే.. తమిళనాడులో 700 మాత్రమే ఉంటాయి. ఆ సమయంలో అక్కడి హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. ఎక్కడైనా జరిగేది ఇదే అంతే కానీ తమిళంలో మనపై వివక్ష చూపుతున్నారు అన్నది కరెక్టు కాదు అంటూ ఆ నిర్మాత చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా కొన్ని సినిమాల విషయంలో అలా జరగడం సహజం అయితే దీనిని ఇండస్ట్రీకి మొత్తం ఆపాదించడం కరెక్టు కాదు అని సినీ ప్రముఖులు చెబుతున్నారు.

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?