Diwali movie releases: దీపావళి పండుగకు తెలుగు సినిమా ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు తెలుగు నిర్మాతలు. ఈ దీపావళి ముందు అరడజనుకు పైగా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఎపిక్ డ్రామాలు, మాస్ ఎంటర్‌టైనర్లు, రొమాంటిక్ డ్రామాలు – అన్నీ ఈ దీపావళి సీజన్‌ను మరింత రంగులగా మార్చనున్నాయి. ఈ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకులు తయారు చేశారు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Read also-Kantara 1 collection: ‘కాంతార చాప్టర్ 1’ మొదటి వారం గ్రాస్ ఎంతో తెలిస్తే షాక్.. మాటల్లేవ్..
1. వృషభ (Vrusshabha) – అక్టోబర్ 16, 2025
దీపావళి ముందే తెరపైకి రానున్న ఈ చిత్రం మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్నారు. నంద కిషోర్ డైరెక్షన్‌లో ఈ పీరియడ్ డ్రామా, మోహన్‌లాల్ కింగ్ వృషభ పాత్రలో కనిపించనున్నారు. సమర్జిత్ లంకేష్, రగిణీ ద్వివేది, నెహా సక్సేనా మరిన్ని కీలక పాత్రల్లో ఉన్నారు. చిత్రం తెలుగు, మలయాళం రెండు భాషల్లో షూట్ చేసి, హిందీ, కన్నడ డబ్బింగ్ వెర్షన్‌లతో పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందింది. సంగీతం సామ్ సి.ఎస్., సౌండ్ డిజైన్ రేసూల్ పూకుట్టి చేత చేశారు.
2. తెలుసు కదా (Telusu Kada) – అక్టోబర్ 17, 2025
రొమాంటిక్ డ్రామా లవర్స్‌కు ఈ చిత్రం ప్రత్యేకంగా ఉంటుంది. సిద్ధు జోన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు, రాషీ ఖన్నా, శ్రీనిధి శెట్టి రెండు హీరోయిన్‌లుగా కనిపిస్తారు. డెబ్యూట్ డైరెక్టర్ నీరజ కోన డైరెక్షన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం, సిద్ధు క్యారెక్టర్ రెండు మహిళల మధ్య హాస్యాస్పద, భావోద్వేగ లవ్ ట్రయాంగిల్ చుట్టూ తిరుగుతుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read also-Deepika Padukone: పని గంటలపై బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. అందుకేనా తప్పించారు..
3. కె-రాంప్ (K-Ramp) – అక్టోబర్ 18, 2025
కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చే ఈ చిత్రం, కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా లీడ్ రోల్స్‌లో చేస్తున్నారు. వెన్నెల కిషోర్, సాయి కుమార్ వంటి సీనియర్లు మరిన్ని పాత్రలు చేస్తున్నారు. డైరెక్టర్ జైన్స్ నాని హాస్య మూవీస్, రూద్రాన్ష్ సెల్యులాయిడ్ బ్యానర్‌పై రూపొందిన ఈ యాక్షన్ రొమాన్స్ డ్రామా. ధనవంతుడైన యువకుడు సంతోషవంతమైన జీవితం గడపడానికి ప్రయత్నించే కథ చెబుతుంది.
4. మిత్ర మండలి (Mithra Mandali) అక్టోబర్ 16, 2025
కామెడీ లవర్స్ ఆకట్టుకునే మ్యాడ్‌క్యాప్ ఎంటర్‌టైనర్ లో ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహారా, విష్ణు ఓయి, నిహారిక ఎన్‌ఎం వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయేందర్ ఎస్ రాసి ఈ సినిమాకు దర్వకత్వం వహించారు. పాలిటీషియన్ కూతురిని లవ్ చేయడంతో మిత్రమండలికి ఏం జరిగింది అన్నది కథ. ఈ సినిమా మొత్తం హాస్యాస్పదంగా ఉంటుంది.
5. డ్యూడ్ (Dude) అక్టోబర్ 17,2025
ప్రదీప్ రంగనాధన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్యూడ్ (Dude)’. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించగా, ఇప్పటికే విడుదలైన మూడు పాటలు సోషల్ మీడియాలో అదిరిపోయే టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
