TCS
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

IT Industry Jobs: టెక్ ఇండస్ట్రీలో షాకింగ్ ట్రెండ్.. టెకీలకు మింగుడుపడని వాస్తవం చెప్పిన టీసీఎస్

IT Industry Jobs: భారతీయ యువతీయువకులకు టెక్ ఇండస్ట్రీ ఎంతో ప్రధానమైనది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో టెకీలుగా మన యువత ఉపాధి అవకాశాలను (IT Industry Jobs)  పొందుతున్నారు. ఈ ఇండస్ట్రీ ద్వారా దేశ ఖజనాకు పెద్ద మొత్తంలో ఆదాయం కూడా సమకూరుతోంది. అయితే, ఏఐ టెక్నాలజీ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల ఫలితంగా గత కొన్నాళ్లుగా టెక్ రంగంలో కలవరపరిచే పరిణామాలు జరుగుతున్నాయి. భవిష్యత్‌ ప్రణాళికలకు అనుగుణంగా ఏఐ టెక్నాలజీలను వేగంగా అందిపుచ్చుకుంటూ చాలా కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ పరిస్థితి ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. తాజాగా, దేశీయ ఐటీ దిగ్గజమైన టీసీఎస్ (TCS) కంపెనీ విడుదల చేసిన ఓ రిపోర్ట్ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

3 నెలల్లో 19 వేల మంది తొలగింపు

టీసీఎస్ కంపెనీ గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ముమ్మరం చేసింది. భారతదేశంలో అతిపెద్ద ఐటీ ఎగుమతిదారుగా, ప్రైవేట్ రంగంలో అత్యధిక ఉద్యోగాలు ఇస్తున్న కంపెనీగా కొనసాగుతున్న టీసీఎస్, సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఆ మూడు నెలల వ్యవధిలో మొత్తం 19,755 ఎంప్లాయీస్‌పై వేటు వేసింది. తొలగింపు వేటుకు గురైన ఉద్యోగులు, స్వచ్ఛందంగా వైదొలగినవారు కలిపి ఈ భారీ స్థాయిలో ఉన్నాయి. దీంతో, గత రెండేళ్ల తర్వాత తొలిసారి టీసీఎస్‌లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 లక్షల దిగువకు పడిపోయింది. ఆందోళనకు గురిచేసే మరో వాస్తవం ఏంటంటే, ఉద్యోగుల తొలగింపు ప్రణాళికల కోసం కంపెనీ ఏకంగా రూ.1,135 కోట్ల నిధిని కేటాయించింది. వాలంటరీ రిటైర్మెంట్‌ కోసం ఈ తరహా ప్యాకేజీలు ఆఫర్ చేస్తుంటారు.

Read Also- Manchu Lakshmi controversy: మంచు లక్ష్మికి క్షమాపణలు చెప్పిన సీనియర్ జర్నలిస్ట్.. ఎందుకంటే?

మార్చి 2026 మరికొందరిపై వేటు

ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన టీసీఎస్, త్వరలోనే మరికొంతమంది ఉద్యోగులపై వేటు వేసే అవకాశాలు ఉన్నాయి. 2026 మార్చి నాటికి కంపెనీ గ్లోబల్ ఉద్యోగుల్లో 2 శాతం మేర తగ్గించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్న టీసీఎస్, లక్ష్యానికి తుది దశలో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ఆధారిత సేవలు అందిపుచ్చుకునే దిశగా కంపెనీ ముందుకు సాగుతుండడమే ఉద్యోగుల తొలగింపునకు కారణంగా ఉంది. మరోవైపు, అమెరికా-భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు కాస్త సున్నితంగా మారడం కూడా ప్రభావం చూపుతోందని టెక్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామంపై టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సుదీప్ కున్నుమాల్ ఇటీవలే స్పందించారు. సీనియర్, మధ్యస్థాయి హోదాల్లో పనిచేసే ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కొందరి నైపుణ్యాలకు ప్రస్తుతం కార్యకలాపాలకు తగిన విధంగా లేదని ఆయన వివరించారు.

ఊహించని మార్పులుంటాయా?

ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు విప్లవం సృష్టిస్తున్నాయి. ఇక, ఐటీ రంగం అయితే సమూలంగా రూపాంతరం చెందుతోంది. టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీ సైతం ఉద్యోగుల తొలగింపుపై దృష్టి పెట్టిందంటే భవిష్యత్‌ పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయన్నది కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న టెకీల తొలగింపులు.. దేశీయ ఐటీ రంగంలో రాబోయే మార్పుల‌కు సంకేతాలుగా భావించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also- Bigg Boss Telugu Promo: వారంలో తప్పులు చేసి.. వీకెండ్‌లో ఒప్పుకుంటే కుదరదు.. నాగ్ మామ వైల్డ్ ఫైర్!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!