Tollywood Movie Robinhood Latest Updates
Cinema

Tollywood Movie: రాబిన్‌ హుడ్ గ్లింప్స్‌ అదుర్స్

Tollywood Movie Robinhood Latest Updates:టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది అగ్రహీరోలు ఉన్నారు. అందులో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఒకరు. అతి చిన్న వయసులోనే జయం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్‌ ఐడెంటీటీని తెచ్చుకున్నాడు. ఎన్నో అద్భుతమైన మూవీస్‌లో యాక్ట్ చేసి ఆడియెన్స్‌కి దగ్గరయ్యాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక మూవీతో నితిన్ తన ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుండగా, జీవి ప్రకాష్ బాణీలు అందిస్తున్నారు.

కాగా, ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో భీష్మ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ భారీ హిట్ అయింది. దీంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో రాబిన్ హుడ్ అనే మూవీ రాబోతోంది. దీంతో ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. అయితే భీష్మ మూవీలో నితిన్ సరసన రష్మిక హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ అద్భుతంగా ఉందని వెంకీ మరోసారి తాను తీయబోయే మూవీలో రష్మికను హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ రష్మిక డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టు నుంచి రష్మిక తప్పకుందట.

Also Read:సింగం మూవీకి గేమ్‌ ఛేంజర్ బ్రేక్‌ ఇవ్వనుందా..?

ఆ తర్వాత ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీల పేరు వినిపించింది. దానికి తగినట్టుగానే ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీలను అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ గ్లింప్స్ రిలీజ్‌ చేశారు. ఈ మూవీలో శ్రీలీల రిచ్ అమ్మాయి లాగా కనిపించింది. ఇందులో శ్రీలీల యాక్టింగ్‌ అద్భుతంగా ఉందని టాక్. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ డిసెంబర్ 20న ఆడియెన్స్‌ ముందుకు రాబోతుంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!