Hero Ajay Devgan singham again will wreak havoc on playing the role of a lion: బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, కరీనా కపూర్ జంటగా నటీనటులు అక్షయ్ కుమార్, రణ్‌వీర్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో రాబోతున్న మూవీ సింగమ్ ఎగైన్. సింగమ్ ఫ్రాంచైజీ మూవీస్‌కు దర్శకత్వం వహించిన రోహిత్ శెట్టి సింగమ్ ఎగైన్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
మొదటగా ఈ మూవీని జులై 12 రిలీజ్ చేయాలనుకున్న షూటింగ్ కాస్త ఆలస్యం కావడంతో ఆగష్టు 15కి పోస్ట్‌పోన్ చేసారు. కానీ ఇప్పుడు మూవీ మరొకసారి రిలీజ్ డేట్‌ని మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల జరిగిన ఓ మీడియా ఈవెంట్‌లో అజయ్ దేవగన్ సింగం ఎగైన్ రిలీజ్‌కి లేట్ కావడానికి గల రీజన్స్‌ని వెల్లడించారు. ఆగస్టు 15 నాటికి సినిమా రెడీ అవుతుందన్న నమ్మకం మాకు లేదు. కాబట్టి తొందరపడటం లేదని ప్రస్తుతం ఈ మూవీని దీపావళికి రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు టాక్.
Also Read: నటిపై కేసు నమోదు, అవాక్కయిన ఫ్యాన్స్
అందుకుగాను ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు మూవీ టీమ్. కానీ దక్షిణాది నుండి దీపావళికి అజిత్ కుమార్ విడాముయార్చి, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా దీపావళికే రెడీ అవుతున్నాయి. దీంతో దీపావళికి గట్టి పోటీ ఉండనుంది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ యాక్ట్ చేసిన స్ట్రీ సీక్వెల్ తెరకెక్కిన స్ట్రీ 2 కూడా డిసెంబర్ నెలలోనే రిలీజ్ కానుంది. మరి సింగం మూవీ అనుకున్న డేట్‌కి వస్తుందో మల్లి పోస్ట్‌పోన్ అవుతుందో చుడాలి.