Actress | నటిపై కేసు నమోదు, అవాక్కయిన ఫ్యాన్స్
Mumbai Court Ordered The Cops Police To Investigate Complaint Against Shilpa shetty
Cinema

Actress: నటిపై కేసు నమోదు, అవాక్కయిన ఫ్యాన్స్

Mumbai Court Ordered The Cops Police To Investigate Complaint Against Shilpa shetty: నటి శిల్పా శెట్టి గురించి టాలీవుడ్‌ ఆడియన్స్‌కి కొత్తగా ఇంట్రడ్యూస్‌ చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే తన పేరుకు తగ్గట్టు శిల్పి ఉలిని పట్టుకొని అందమైన శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది శిల్పా శెట్టి శరీర సౌష్ఠవం. ఇక ఈ భామ మధ్యలో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా.. తన యోగాసనాలతో ఫ్యాన్స్‌కు ఎపుడు దగ్గరగానే ఉంది. ఏజ్ 50 ఏళ్లకు దగ్గర పడ్డ ఇప్పటికీ అదే శరీరాకృతితో అలరిస్తూనే మెస్మరైజ్ చేస్తోంది ఈ మంగళూరు భామ.

ఆ సంగతి పక్కన పెడితే.. శిల్పాశెట్టితో పాటు ఆమె భర్తపై ఛీటింగ్ కేసు నమోదు అయింది. ఆమె భర్త రాజ్ కుంద్రాపై బోగస్ గోల్డ్ స్కీమ్ పథకంతో తమను మోసం చేసినట్టు ఓ బిజినెస్ మ్యాన్ చేసిన కంప్లైంట్ ఆధారంగా ముంబై స్పెషల్ సెషన్స్ జడ్జ్ ఎన్.పి.మెహతా ఆదేశాల మేరకు ముంబై పోలీసులు శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు చేసారు.శిల్పా శెట్టి దంపతులు కొత్తగా స్థాపించిన సత్ యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, దాని టూ బోర్డ్ మెంబర్స్.. ఒక ఎంప్లాయి కలిసి బంగారం మోసానికి పాల్పడినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండటంతో కోర్టు వారిపై కేసు నమోదుకు ఆదేశించారు.

Also Read: బంపరాఫర్‌, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

శిల్పాశెట్టి విషయానికొస్తే రీసెంట్ గా ఈ భామ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్ పోలీస్ ఫోర్స్‌లో తార శెట్టి అనే పోలీస్ ఆఫీసర్‌లో పాత్రలో మెప్పించింది.పేరుకు హిందీ భామ అయినా.. తెలుగు సినిమాలతో శిల్పాకు మంచి అనుబంధమే ఉంది. శిల్పాశెట్టి.. టాలీవుడ్‌లో వెంకటేష్ హీరోగా దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన సాహసవీరుడు సాగరకన్య మూవీతో ఇంట్రడ్యూస్ అయింది. దీంతో అందులో ఆమె చేసిన రోల్స్‌ అన్ని కూడా టాలీవుడ్‌ ఫ్యాన్స్‌కి ఇప్పటికి గుర్తుండిపోయేలా ఉంటాయి.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క