Bhatti Vikramarka: హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పేర్కొన్నారు. ఆయన హైటెక్స్ లో జరిగిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ 15 వ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఆతిథ్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేశంలోని ఏ రాష్ట్రంలో కనబడదన్నారు.స్నేహితులు,బంధువులు ఇంటికి వస్తే ఆ రోజు పండుగ జరుపుకునే మనస్తత్వం తెలంగాణ ప్రజలది అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిలో బిల్డర్లు, రియల్టర్లు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. దట్టమైన అడవులు, వాటి లోపల ఉన్న జలపాతాలు, టైగర్ ఫారెస్ట్ లు ఉన్నాయన్నారు.
అభివృద్ధికి ఏటా రూ. వేల కోట్లు
హైదరాబాదులో అంతర్జాతీయ విమానాశ్రయం, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి రియల్టర్లు వివిధ వర్గాలను ఆ ప్రాంతాలకు విరివిగా తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం కోరారు. ప్రతి సంవత్సరం పట్టణ అభివృద్ధికి ప్రణాళిక వ్యయం లో భాగంగా బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయిస్తున్నాం అన్నారు. రెండు సంవత్సరాల్లో 20 వేల కోట్లు కేటాయించి చేపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడు ఇప్పుడే కనిపిస్తున్నాయి, ఈ పనులు హైదరాబాద్ రూపురేఖలను మారుస్తాయి అన్నారు. ఇటీవల 39 ఎస్టీపీ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనులకు ఆమోదం తెలిపామన్నారు. సీనరేజి ప్లాంట్లు, తాగునీటి అవసరాల కోసం సుమారు రూ. 11,927 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రూ. 13,704 కోట్ల వ్యయంతో మరికొన్ని తాగునీటి, సీవరేజీ ప్లాంట్ పనులు ప్రతిపాదనలో ఉన్నాయని వివరించారు.
1,487 కోట్లు ఖర్చు
ఇక ప్యారడైజ్ జంక్షన్ నుంచి నేషనల్ హైవేను కలుపుతూ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు 1,487 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఢిల్లీలో మకాం వేసి కేంద్ర డిఫెన్స్ మంత్రిని ఒప్పించి రక్షణ శాఖ భూములను వినియోగించుకునేందుకు అనుమతి సాధించారని డిప్యూటీ సీఎం తెలిపారు. షామీర్పేటలో 3,619 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నామని వివరించారు. దేశంలోని ఇతర ఏ నగరాల్లో లేనివిధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు, మంచినీటి సరఫరా హైదరాబాద్ నగరంలోనే జరుగుతుంది అన్నారు.
పార్కులను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాలి
గతంలో ఉన్న మంజీరా, గండిపేటకు తోడు గోదావరి నీళ్లు తరలిస్తున్నాము ఇవి నగర ప్రజలకు పరిశ్రమలకు పెద్ద ఆస్తి అన్నారు. హైదరాబాద్ నగరం లోని సరస్సులు, అందమైన రాతిగుట్టలు, పార్కులను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాలి అన్నారు. ప్రజా ప్రభుత్వం బిజినెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. బిల్డ్ నౌ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఏర్పాటుచేసి నిర్మాణ అనుమతులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసేలా పసుపు ఏర్పాట్లు చేసింది అన్నారు. హైదరాబాదులో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చే క్రమంలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తామన్నారు.
Also Read: Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ట్రంప్‌కు మాత్రం కాదు.. మరి ఎవరికంటే?
