Uppal Balu: ఉప్పల్ బాలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యాడు. ఇతను ఎక్కడ ఉంటే అక్కడ సందడి సందడీగా ఉంటుంది. ఎందుకంటే, ఉప్పల్ బాలు మాటలు అలాగే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్.. షాక్ అయ్యారా అంటూ మొదలు పెట్టి తనకీ సంబంధించిన వీడియోలు అన్ని సోషల్ మీడియాలో ప్రతిదీ షేర్ చేస్తాడు. ఇలా లక్షల్లో ఫాలోయర్స్ ను సంపాదించుకున్నాడు. అయితే, ఇటీవలే ఉప్పల్ బాలు ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్ళి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. మంచి అమ్మాయి దొరికితే పెళ్ళి చేసుకుంటా.. పిల్లలను కంటా అని తన మాటల్లో చెప్పుకొచ్చాడు.
Also Read: Skin Care: మనం రోజూ వాడే సబ్బులు మంచివి కావా?
ఉప్పల్ బాలు మాట్లాడుతూ.. ” నా దగ్గరకు ఎవరైనా వచ్చి నన్ను పెళ్ళి చేసుకుని లైఫ్ లాంగ్ నీతో ఉంటాను. కలిసి ట్రావెల్ చేస్తాను అని చెప్తే కచ్చితంగా పెళ్ళి చేసుకుంటాను. లేదు అనుకుంటే నేను ఎవర్ని పెళ్ళి చేసుకోను. అయితే, మీరు పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో చెప్పండి అని యాంకర్ అడగగా.. నాకు అమ్మాయి ఎలా ఉన్నా ఓకే. నేను ఆమె దగ్గర నుంచి ఏం ఆశించను. వాళ్ళ ఇంట్లో వాళ్లు ఆమెకి ఏమైనా బంగారం పెట్టుకుంటే ఓకే.. నేను సంపాదిస్తా .. మూడు పూట్లా కూర్చొని తినొచ్చు ” అని తన మాటల్లో చెప్పుకొచ్చాడు.
Also Read: ED raids Mammootty properties: మలయాళ సూపర్ స్టార్ ఆస్తులపై మరో సారి దాడి చేసిన ఈడీ..
