mammootty( image :insta)
ఎంటర్‌టైన్మెంట్

ED raids Mammootty properties: మలయాళ సూపర్ స్టార్ ఆస్తులపై మరో సారి దాడి చేసిన ఈడీ..

ED raids Mammootty properties: మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తండ్రి అయిన మమ్ముట్టి ఆస్తులపై ఈడీ మరోసారి దాడులు నిర్వహించింది. తాజాగా దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చెన్నైలోని గ్రీన్‌వేస్ రోడ్‌లో మమ్ముట్టికి చెందిన ఆస్తిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడి చేసింది. మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, అలాగే వేర్ఫేర్ ఫిలిమ్స్ టీమ్ ఈ దాడిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఎనిమిది మంది ఈడీ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి, మమ్ముట్టికి చెందిన వేర్ఫేర్ ఫిలిమ్స్ కార్యాలయంలో శోదాలు నిర్వహించారు. ఈ చర్య, ఇటీవల ఈడీ కోచి జోనల్ కార్యాలయం కేరళ, తమిళనాడులో నిర్వహించిన దాడుల కొనసాగింపుగా చేపట్టబడింది. ఈ దాడులు విలువైన లగ్జరీ వాహనాల అక్రమ రవాణా, అనధికార విదేశీ మారక ద్రవ్య లావాదేవీలపై జరుగుతున్న విచారణలో భాగంగా ఉన్నాయి. ఈ కేసులో దుల్కర్ సల్మాన్ పేరు కూడా ఉంది. ఈ ఆపరేషన్ మొత్తం 17 ప్రాంతాలను కవర్ చేసింది. అందులో చిత్ర నటులు ప్రిత్విరాజ్, దుల్కర్ సల్మాన్, అమిత్ చకలాకల్ ఇళ్లతో పాటు, వాహన యజమానులు, ఆటో వర్క్‌షాపులు, ఎరుణాకుళం, త్రిశూర్, కోజికోడ్, మలప్పురం, కొట్టాయం, కోయంబత్తూరు ప్రాంతాల వ్యాపార సంస్థలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

Read also-Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో ఇంటర్‌నెట్ సేవలకు బ్రేక్!

ఈడీ ప్రకారం

“కోయంబత్తూరులో ఉన్న ఒక నెట్‌వర్క్ నకిలీ పత్రాలు (ఇండియన్ ఆర్మీ, యుఎస్ ఎంబసీ, విదేశాంగ శాఖ పేరిట తయారు చేసినవి) ఉపయోగించి, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నకిలీ ఆర్‌టీవో రిజిస్ట్రేషన్లు చేసింది. తరువాత ఈ వాహనాలను కొంతమంది ప్రముఖులకు, ముఖ్యంగా సినీ తారలకు తక్కువ ధరలకు విక్రయించారు.” ఈ దందాను గ్రహించిన ఈడీ అక్రమంగా దిగుమతి చేసుకున్న వారిపై నిఘా పెంచి వారి ఆస్తులపై దాడులకు పాల్పడుతున్నారు. భూటాన్/నేపాల్ మార్గాల ద్వారా ల్యాండ్ క్రూయిజర్, డిఫెండర్, మసెరాటి వంటి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకుని రిజిస్ట్రేషన్ చేసిన సిండికేట్‌పై ఆధారాలతో సహా ఈడీ దాడులు నిర్వహించింది.

Read also-Mohan Babu University: మోహన్‌బాబు యూనివర్సిటీకి బిగ్ షాక్.. అయినా అవేం పనులు..

దుల్కర్ సల్మాన్‌కు సంబంధం

దుల్కర్ సల్మాన్ ఇటీవల తన లగ్జరీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ విభాగంపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వాహనం స్వాధీనం చేయడం అన్యాయమని, దీని వల్ల తన పేరు ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆయన వాదించారు. సెప్టెంబర్ 23న ఆయన నివాసంలో శోధన జరగగా, రెండు లగ్జరీ కార్లు స్వాధీనం అయ్యాయి. “ఈ స్వాధీనం విషయంలో మీడియా కావాలనే ప్రచారం చేసింది. నా వాహనం మత్తు పదార్థాల అక్రమ రవాణా, వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించినట్లు చూపించడం వల్ల నాకు చెడు పేరు వచ్చింది. ఇది నా ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించింది.” అని తన పిటిషన్‌లో దుల్కర్ పేర్కొన్నారు. వేర్ఫేర్ ఫిలిమ్స్ సంస్థను దుల్కర్ సల్మాన్ 2019లో స్థాపించారు. కస్టమ్స్ విభాగం ఇటీవల కేరళలోని ప్రముఖుల ఇళ్లపై దాడులు చేసింది. అందులో దుల్కర్ సల్మాన్, ప్రిత్విరాజ్ సుకుమారన్ కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్‌కు “నమ్‌ఖోర్” అనే పేరు పెట్టారు. ఇది భూటానీస్ భాషలో “వాహనం” అని అర్థం. ఈ ఆపరేషన్ భూటాన్ నుండి అక్రమంగా దిగుమతి చేసిన సెకండ్‌ హ్యాండ్ వాహనాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది