Women Be careful: మహిళల్లో కొందరికి కన్ను, పెదవి, చెయ్యి , పాదం అదరడం మనం చూసే ఉంటాము. అలా జరిగినప్పుడు దాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోరు. “ఇది ఎందుకు జరిగింది?” అని ఆలోచించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. మన హిందూ సంప్రదాయంలో, జ్యోతిష్య శాస్త్రంలో ఈ శరీర భాగాల అదురుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. దీన్ని “అంగస్ఫురణ శాస్త్రం” అంటారు. ఈ శాస్త్రం ప్రకారం, శరీర భాగాల అదురు రాబోయే మంచి లేదా చెడు సంకేతంగా చెబుతుంటారు.
ముఖ్యంగా, స్త్రీల విషయంలో ఈ అదురు విభిన్న ఫలితాలను సూచిస్తుంది. కొన్నిసార్లు సంతోషానికి, మరికొన్నిసార్లు కష్టాలు వచ్చేలా చేస్తుంది. అందుకే.. పెద్దలు ఈ అంగస్ఫురణను తీసి పడేయద్దని సలహా ఇస్తారు. స్త్రీలలో ఈ శరీర భాగాలు అదిరితే రాబోయే పెద్ద సమస్యలను సూచిస్తాయని చెబుతున్నారు.
కుడి కన్ను అదరడం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, స్త్రీలకు కుడి కన్ను అదరడం చెడు సంకేతంగా పరిగణిస్తారు. ఇది కుటుంబంలో విభేదాలు, అనవసరమైన వాదనలు లేదా మానసిక ఒత్తిడి పెరగడాన్ని సూచిస్తుంది. అంతేకాదు, ఊహించని విచారకరమైన వార్త వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఓపికతో ఉండటం, గొడవలకు దూరంగా ఉండటం మంచిది.
పెదవులు లేదా నోరు అదరడం
పెదవులు, ముఖ్యంగా కింది పెదవి అదరడం స్త్రీలకు అశుభంగా చెబుతుంటారు. ఇది మాటల ద్వారా తలెత్తే తగాదాలను లేదా ప్రమాదకర సంఘటనలను సూచిస్తుంది. ఇలాంటి సంకేతం కనిపిస్తే, మాటలు జాగ్రత్తగా ఎంచుకోవడం ద్వారా సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయి.
Also Read: Adluri Laxman vs Ponnam: మంత్రుల మధ్య సయోధ్య.. విభేదాలను చక్కదిద్దిన టీపీసీసీ.. వివాదం ముగిసినట్లే!
అరచేయి అదరడం
స్త్రీలకు అరచేయి లేదా చేతులు అదరడం ఆర్థిక సమస్యలను పెంచేలా చేస్తాయి. ఇది ఊహించని ఖర్చులకు దారి తీస్తుంది. డబ్బు నష్టం లేదా ఆర్థిక ఇబ్బందులను సూచిస్తుంది. అందుకే ఇలాంటి సమయంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
పాదం లేదా మడమ అదరడం
స్త్రీల పాదం అదరడం సాధారణంగా ప్రయాణాన్ని సూచిస్తుంది, కానీ ఆ ప్రయాణం సవాళ్లతో కూడి ఉంటూంది. ముఖ్యంగా, మడమ అదిరితే, రాబోయే రోజుల్లో వాదనలు లేదా పోరాటాలు ఎదురయ్యే అవకాశం ఉందని నమ్ముతారు.
కుడి కనుబొమ్మ అదరడం
కుడి కనుబొమ్మ అదరడం కూడా స్త్రీలకు అశుభంగా చెబుతుంటారు. ఇది కుటుంబ సభ్యుల లేదా బంధువులతో మనస్పర్థలను సూచిస్తుంది. ఇలాంటి సమయంలో ఓపికతో ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
