Warangal Collector ( IMAGE Credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Warangal Collector: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

Warangal Collector: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పక్కడ్బందీ ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద (Collector Dr. Satya Sarada) అధికారులను ఆదేశించారు.  కలెక్టర్ వరంగల్ (Warangal Collector) జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ స్వీకరణకు చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహణకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సామాగ్రి, రిటర్నింగ్, సహాయ అధికారి స్వీకరణ గదులను, జనరల్ అబ్జార్వర్, వ్యయ పరిశీలకుల గదులు, ఎన్నికల సిబ్బంది, తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు.

Also Read:HCA: హెచ్​సీఏ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేత! 

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగాలి

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా సజావుగా జరగాలని, నామినేషన్ల స్వీకరణకు సంబంధించి తీసుకోవలసిన భద్రతా చర్యలు, పాటించాల్సిన విధానాలు, ప్రజలకు అందుబాటులో ఉండే సౌకర్యాలపై సమీక్షించారు. ఏలాంటి పొరపాట్లు, ఆలస్యం లేకుండా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగాలని, భద్రతాపరంగా పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ర్యాంపులు, దివ

ఇందిరమ్మ ఇండ్లు, పాఠశాల సందర్శించిన కలెక్టర్

పాఠశాల విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించి విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని పరిశీలించి, ఇష్టపడి చదివి భావి భారత పౌరులుగా కావాలని ఆకాంక్షించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వడ్డించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తగు చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లును ఆదేశించారు. వర్ధన్నపేట ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అదేవిధంగా రాయపర్తి రైతు వేదిక ప్రక్కన నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని కలెక్టర్ పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

వరంగల్ జిల్లా సరిహద్దులో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్

వర్ధన్నపేట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో ఇళ్ల లబ్ధిదారులు నిర్మించిన ఇందిరమ్మ గృహాన్ని కలెక్టర్ పరిశీలించి షాబాషా దంపతులను అభినందించి త్వరగా గృహప్రవేశం చేయాలని కోరారు. అనంతరం రాయపర్తి మండలం వరంగల్ జిల్లా సరిహద్దులో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి, డిపిఓ కల్పన, హౌసింగ్ పీడీ గణపతి, డిబిసిడివో పుష్పలత, నోడల్ అధికారులు, తాసిల్దారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. 

Also Read: Nizamabad: ఆ జిల్లాలో కష్టకాలంలో.. పార్టీ జెండా మోసినవాళ్లకే జిల్లా పరిషత్

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది