Youth Health Issues: ఈ రోజుల్లో చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా యువతను మెడ నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇవి వయసు పైబడిన వారిని మాత్రమే కాకుండా, యువతను కూడా వెంటాడుతున్నాయి. 20 ఏళ్లలోనే మెడ బిగుసుకుపోవడం, 30 ఏళ్లకే నడుం నొప్పి రావడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా నగరాల్లో నివసించే యువతలో బాగా కనిపిస్తోంది. ఈ ఆరోగ్య సమస్యను నిపుణులు ‘అర్బన్ స్పైన్ క్రైసిస్’ అని పిలుస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
యువతలో అలాంటి సమస్యను గుర్తించిన నిపుణులు
మన జీవనశైలిలో వచ్చిన మార్పులు, ముఖ్యంగా కార్పొరేట్ పని వాతావరణం. ఈ రోజుల్లో యువత డబ్బు వెనుక పరుగెడుతున్నారు. ముఖ్యంగా, గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్ల ముందు కుర్చీలకు అతుక్కుపోయి ,మరి పని చేస్తున్నారు. వర్చువల్ మీటింగ్స్, ఒకే చోట గంటల తరబడి కదలకుండా కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి వెన్నుముకపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
దీని వల్ల కండరాలు బలహీనపడి, వెన్నుపూసల మధ్య అరుగుదల తగ్గుతోంది.
Also Read: Crime News: వివాహేతర సంబంధం అనుమానంతో.. భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త.. ఎక్కడంటే?
ఇది ఆఫీసు సమయంతోనే ఆగిపోకుండా ఇళ్ళకి వెళ్లి పోయిన తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్‌లలో తల దించుకుని గడపడం ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడపై అధిక భారం పడి, అది అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఒక సర్వేలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. వెన్ను, మెడ నొప్పులతో బాధపడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. టెక్నాలజీ మన పనిని సులభతరం చేసినా, మన శరీరంపై దాని ప్రభావం వినాశకరంగా ఉంటోంది.
నిర్లక్ష్యం వద్దు, జాగ్రత్త ముద్దు!
మెడ బిగుసుకుపోవడం, చేతుల్లో తిమ్మిరి, స్వల్ప నడుం నొప్పి వంటి లక్షణాలను చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. నొప్పి వచ్చినప్పుడు ఓ పెయిన్‌కిల్లర్ వేసుకోవడం లేదా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం వంటివి చేస్తారు. కానీ ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి, సమస్యను శాశ్వతంగా తగ్గించలేవు. ఈ చిన్న నిర్లక్ష్యం భవిష్యత్తులో స్పాండిలైటిస్, స్లిప్ డిస్క్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.
Also Read: Tummala Nageswara Rao: టోల్ ఫ్రీ నంబర్ గూర్చి విస్తృత ప్రచారం చేయండి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
