MCMC Committee: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్ జిల్లాస్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)ని మంగళవారం ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఏర్పడిన ఈ కమిటీ, ఎన్నికల సమయంలో ప్రచార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే వార్తలు, ప్రకటనలు, చెల్లింపు వార్తలపై పర్యవేక్షణ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్ ఈ కమిటీకి చైర్మన్ గా, జీహెచ్ఎంసీ ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు.
ఎన్నికల ప్రక్రియలో
సికింద్రాబాద్ ఆర్డీఓ(RDO), జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి.సాయి రామ్(Sairam) నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు. జీహెచ్ఎంసీ(GHMC) డిప్యూటీ ఇంజనీర్ (ఐటి వింగ్ – సోషల్ మీడియా) నర్సింగ్‌రావు, హైదరాబాద్ పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ మనసా కృష్ణ కాంత్(Mansakrishna Kanth) , ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డైలీ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ బచన్ జీత్ సింగ్ లు కమిటీలో సభ్యులుగా వ్యవహారించనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, మీడియా సమన్వయం కోసం ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుందని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.
Also Read: Amazon Diwali Sale: భారీ డిస్కౌంట్.. రూ.2,549లకే ఐఫోన్ 15
బై ఎలక్షన్ నోడల్ అధికారులు వీరే
* లా అండ్ ఆర్డర్, వల్నరబుల్ మ్యాపింగ్, డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ – నగర పోలీసు కమిషనర్ సజ్జనార్
* మ్యాన్ పవర్ మేనేజ్‌మెంట్ – జాయింట్ కమిషనర్ ఎన్. శంకర్
* ఈవీఎం, వీవీ వివిప్యాట్ నిర్వహణ – కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌవన్
* ట్రైయినింగ్ – ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్
* ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్ మెంట్ – చీఫ్ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్ శ్రీనివాస్
* మెటీరియల్ మేనేజ్ మెంట్ – అదనపు కమిషనర్ (అడ్మిన్) కె. వేణుగోపాల్
* ఎంసీసీ – అదనపు ఎస్పీ(విజిలెన్స్ జీహెచ్ఎంసీ) డీఎస్పీ నరసింహా రెడ్డి
* ఎన్నికల వ్యయ పరిశీలకులు – చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ (జీహెచ్ఎంసీ ) వెంకటేశ్వర్ రెడ్డి
* ఎన్నికల పరిశీలకులు – అసిస్టెంట్ వెటర్నరీ అధికారి విల్సన్
* డమ్మీ బ్యాలెట్ పేపర్ – సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్
* సైబర్ సెక్యూరిటీ, ఐటీ, కంప్యూటరైజేషన్ – జాయింట్ కమిషనర్ (ఐటీ) సి. రాధా
* హెల్ప్‌లైన్, కంప్లైంట్ రీడ్రెస్సల్ – ఐటీ (ఏఈ) కార్తీక్ కిరణ్
* వెబ్‌కాస్టింగ్ – ఐటీ (ఏఈ) తిరుమల కుమార్
ALSO Read: Indian Techie: భారతీయ టెకీని ఉద్యోగంలోంచి తీసేసి.. మళ్లీ రమ్మని బతిమాలుతున్న కంపెనీ
