Nalgonda Crime: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై హత్య
Crime News (image credit: twitter)
క్రైమ్, నార్త్ తెలంగాణ

Nalgonda Crime: నల్గొండలో దారుణ ఘటన.. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై హత్య!

Nalgonda Crime: నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన అన్నా రెడ్డి గూడెంకు చెందిన లావణ్య కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది. నల్గొండ మండలం గుట్ట కింది అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ గౌడ్ ట్రాక్టర్ డ్రైవర్ తో ప్రేమలో పడింది. గత ఆరు నెలలుగా ఇరువురు ప్రేమించుకుంటున్నారు. లావణ్యను కృష్ణ తన ఫ్రెండ్ రూమ్ కి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో కృష్ణ లావణ్యను చంపేసి డైట్ కాలేజ్ సమీపంలో మృతదేహాన్ని పడేశాడు. లైంగిక దాడి (Crime News) చేసిన అనంతరం హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. లావణ్యను హత్య చేసి డైట్ కాలేజీ వద్ద పడేసిన కృష్ణను టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Also Read: Crime News: వివాహేతర సంబంధం అనుమానంతో.. భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త.. ఎక్కడంటే?

ఘటన స్థలానికి చేరుకున్న డిఎస్పి శివరాం రెడ్డి

మృతి చెందిన లావణ్యను డైట్ కాలేజీ వద్ద పడేసిన ప్రాంతానికి డిఎస్పి శివరాం రెడ్డి చేరుకున్నారు. లావణ్య పై జరిగిన అఘత్యాన్ని పరిశీలించి మృతదేహాన్ని నల్గొండ జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న టూ టౌన్ పోలీసులు లావణ్యను హత్య చేసిన గడ్డం కృష్ణ కోసం నాలుగు బృందాలుగా పోలీసులు విడిపోయి దర్యాప్తు వేగవంతం చేశారు.

నిందితుడిని కూడా చంపేయాలి 

నిందితుడు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎన్కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నా కూతురును హత్య చేసిన నిందితుడిని కూడా చంపేయాలని లావణ్య తల్లి డిమాండ్ చేశారు. లావణ్యను హత్య చేసిన గడ్డం కృష్ణ మొబైల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకొని సిడిఆర్ పరిశీలిస్తున్నారు. మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడు కృష్ణను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నిందితుడు కృష్ణ తన ఫ్రెండ్ రూముకు తీసుకెళ్లిన ఇంటి ఓనర్ వద్ద నుంచి కూడా వివరాలు సేకరించారు.

 Also Read: Crime News: పనిచేస్తున్న సంస్థకే టోకరా.. కోటిన్నర విలువ చేసే నగలతో పరార్.. ఎక్కడంటే..?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?