Bhadrachalam: జల్, జంగిల్, జమీన్(నీళ్లు, అడవులు, భూమి అనే నినాదంతో అప్పటి నిజాం రాజులను గడగడలాడించిన ఘనుడు ఆదివాసీల ఆరాధ్య దైవం కుమరం భీమ్ అని భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ పేర్కొన్నారు. కొమరం భీమ్ 85వ వర్ధంతి సందర్భంగా భద్రాచలం (Bhadrachalam) ఐటీడీఏ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పిఓ రాహుల్ మాట్లాడుతూ…
మారుమూల ఆదివాసి గిరిజన గూడెంలలో నివసిస్తున్న గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు కొమరం భీమ్ అన్నారు. గిరిజనులకు చెందాల్సిన హక్కులు సాధించుకోవడానికి నిజాం ప్రభుత్వంతో పోరాడి అశువులు బాసిన పోరాట వీరుడు, అమరజీవి కుమురం భీం అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజన ఉద్యమ నాయకుడు కొమరం భీమ్ గిరిజన గోండి తెగకు చెందిన కొమరం చిన్ను, సోంబాయి దంపతులకు 1901 అక్టోబర్ 22న ఆసిఫాబాద్ తాలూకా సంఖ్య పల్లి గ్రామంలో జన్మించారని తెలిపారు.
Also Read: Rakesh Poojary: కాలం ఎంత విచిత్రమైనదో.. నటించిన సినిమా చూడకుండానే మృత్యుఒడిలోకి!
జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఉద్యమం
నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడారని, అడవిని జీవనోపాధిగా చేసుకుని అన్ని రకాల నిజాం అధికారాలను న్యాయస్థానాలు, చట్టాలు తోసి పుచ్చాడని, నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడని, పశువుల కాపరులపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా, తన భూమిలో తమదే అధికారం అని జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఉద్యమించి ఆదివాసీలపై నిజాం నవాబ్ సాగించిన దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన మహోన్నత ఘనుడు కొమరం భీమ్ అని కొనియాడారు. కొండ కోనల్లో ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసి ప్రజలకు అడవి పై హక్కు సామాజిక న్యాయములో భాగం అని నినదిస్తూ 1928 నుంచి 1940 వరకు రణభేరి మోగించిన కొమరం భీం నిజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాట యోదుడన్నారు.
15 ఏళ్ల నో నువ్వు మీసాలు
15 ఏళ్ల నో నువ్వు మీసాల వయసులోనే అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణిస్తే కొమరం భీమ్ కుటుంబం కెరమెరి ప్రాంతంలోని సుర్దాపూర్ కు వలస వెళ్లిందన్నారు. సాగు చేసుకుంటున్న భూమిని సిద్ధికి అనే జమీందార్ ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతనిని హతమార్చి అస్సాం వెళ్లిపోయాడని, ఐదేళ్లపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి గ్రామానికి చేరుకున్నాడని తెలిపారు.
నిజాం నవాబు పశువుల కాపరులపై విధించిన సుఖానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమం సాగించాడు అన్నారు. భీమ్ కు కుడి భుజంగా కొమరం సూరు కూడా ఉద్యమంలో సహచరుడిగా పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, ఆర్ సి ఓ గురుకులం అరుణకుమారి, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఎస్ ఓ భాస్కర్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, పి వీ టి జి అధికారి రాజారావు, ఎ సి ఎం ఓ రమేష్, డీఎస్ఓ ప్రభాకర్ రావు, మేనేజర్ ఆదినారాయణ, జేడీఎం హరికృష్ణ, రిటైర్డ్ ఏ సి ఎం ఓ రమణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: CM Revanth Reddy: హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే.. పార్టీ పరంగా రిజర్వేషన్లు
