Hyderabad: సాధారణంగా రోడ్డు పక్కన ఉండే పెట్రోల్ బంకులు ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. జరిగే విపత్తును అంచనా వేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది. అందుకే పెట్రోల్ బంక్ పరిసరాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తుంటారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని ఓ పెట్రోల్ బంకుకు వచ్చిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బంకులోని ఇతర వాహనదారులు తలో దిక్కు వెళ్లిపోయారు. చివరికి పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Also Read: BC Reservations: కాంగ్రెస్‌కు బిగ్ రిలీఫ్.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్ పంజాగుట్టలోని ఎర్రమంజిల్ వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ కొట్టించుకునేందుకు బంకుకు వచ్చిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంకు ఆవరణలోనే కారు తగలబడటం ప్రారంభమైంది. దీంతో ఏం జరుగుతుందోనన్న భయంతో ఒక్కసారిగా ఇతర వాహనదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు వెంటనేటే అప్రమత్తమైన పెట్రోల్ బంకు సిబ్బంది.. అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు. ఘటన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వారు సకాలంలో కారు నుంచి బయటకు వచ్చేయడంతో ప్రమాదం తప్పింది.
Also Read: Supreme Court: సుప్రీంకోర్టులో షాకింగ్ ఘటన.. సీజేఐ గవాయ్‌పైకి బూటు విసరబోయిన లాయర్
అయితే పెట్రోల్ బంకు ఆవరణలో మంటలు చెలరేగడం చూసి.. చుట్టుపక్కల ప్రజలు సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంటలు ఆర్పేంత వరకూ కూడా ఏం జరుగుతుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని నిలబడిపోయారు. పెట్రోల్ బంకు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలు ఆర్పేయడంతో స్థానికులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. మంటలు ఆర్పిన అనంతరం కారును.. పెట్రోల్ బంకుకు దూరంగా సిబ్బంది నెట్టుకుంటూ వెళ్లారు. అయితే కారులో మంటలు రావడానికి గల కారణాలు తెలియరాలేదు.
పంజాగుట్ట పెట్రోల్ పంపులో కారులో మంటలు… తప్పిన పెను ప్రమాదం
HYD: పంజాగుట్ట, ఎర్రమంజిల్ వద్ద గల పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంటనే బయటకు వచ్చారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక… pic.twitter.com/YK6gzc5EMC
— ChotaNews App (@ChotaNewsApp) October 6, 2025
Also Read: West Bengal-Bhutan: డేంజర్‌లో బెంగాల్.. ప్రమాదకరంగా భూటాన్ డ్యామ్.. ఏ క్షణమైనా నీరు ముంచెత్తే ఛాన్స్!
