Krishna Mohan Reddy: రానున్న స్థానిక సంస్థలు ఎన్నికలలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి (Krishna Mohan Reddy) సూచించారు. జిల్లా కేంద్రంలోని పటేల్ ప్రభాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మల్డకల్ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Krishna Mohan Reddy) హాజరై మాట్లాడారు. త్వరలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. త్వరలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు.ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి ఎంపీటీసీ,జడ్పిటిసి, సర్పంచుల అభ్యర్థులను గెలిపించి భవిష్యత్తులో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
Also Read: Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ చూసిన ఫ్యాన్స్ థియేటర్లో ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్..
ప్రతి ఒక్కరు కృషి చేయాలి
అనంతరం నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, విక్రసింహారెడ్డి మాట్లాడుతూ మన మండలం మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యే బలపర్చిన అభ్యర్థిని గెలిపించి మన గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి , జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు మాజీ ఎంపీపీ రాజారెడ్డి, మాజీ జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, పిఎసిఎస్ ఛైర్మన్ తిమ్మారెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
