Meenakshi Natarajan (Image Source: Twitter)
తెలంగాణ

Meenakshi Natarajan: ఓట్ చోర్‌పై సీరియస్‌నెస్ ఏది.. ఏఐసీసీ పిలుపును పట్టించుకోరా.. నేతలపై మీనాక్షి నటరాజన్ ఫైర్

Meenakshi Natarajan: ఓట్ చోర్ పై జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ సూచించారు. ఏఐసీసీ పిలుపును కొందరు పట్టింపు లేనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. నేతల్లో నిర్లక్ష్యం తగదన్నారు. పార్టీ కార్యక్రమాలను స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్ లో ఆమె మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఓట్ చోరీపై విస్తృతంగా ప్రోగ్రామ్ చేయాలన్నారు. సంతకాలు సేకరించాలన్నారు. బీజేపీ తప్పిదాలను జనాల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు.

Also Read: Hyderabad: మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్.. మళ్లీ జంట జలాశయాల గేట్లు ఎత్తివేత

పీసీసీ చీఫ్ ​మహేష్​ కుమార్ గౌడ్ సైతం మాట్లాడుతూ.. దేశంలో ఓట్ చోర్ పెద్ద ఎత్తున జరిగిందని, ఓట్ చోర్ తోనే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంఘంగా పని చేస్తుందన్నారు. ఓట్ చోరీ విషయంలో అన్ని రకాల ఆధారాలతో రాహుల్ గాంధీ ఓట్ చోరీ లను బయటపెట్టారన్నారు. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. మన దగ్గర సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కొంచెం ఆలస్యం జరిగిందన్నారు.

Also Read: Hyderabad Crime: సొంత చెల్లెలిపై కక్ష.. మేనకోడల్ని చంపిన కిరాతకుడు.. వెలుగులోకి సంచలన నిజాలు

ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గ్రామానికి కనీసం వంద మందితో సంతకాలు చేయించాలని టార్గెట్ ఇచ్చారు. ప్రతీ గ్రామంలో ఓట్ చోరీ ఎలా జరిగిందో, ప్రజలకు వివరించాలన్నారు. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రతి గ్రామంలో ఈ సంతకాల సేకరణ జరిగే విధంగా కార్యక్రమం నిర్వహించాలన్నారు. అక్టోబరు 15 నాటికి సంతకాల సేకరణ పూర్తి చేసి ఏఐసీసీ కి పంపాల్సిన అవసరం ఉన్నదన్నారు.

Also Read: Sama Ram Mohan Reddy: ‘హరీష్​ రావుకు అరుదైన వ్యాధి ఉంది’.. కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది