Kantara Chapter 1: దసరా సందర్భంగా విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.150 కోట్లు కలెక్షన్స్ వసూళ్లు చేసి సంచలనం సృష్టిస్తోంది. అయితే కాంతార చాప్టర్ 1 ధియేటర్లలో ఫ్యాన్ చేసిన పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కర్ణాటక లోని ఓ థియోటర్లో కల్ట్ ఫ్యాన్ అచ్చం కాంతార వేషధారణలో వచ్చి నాట్యం చేశాడు. అసలే సినిమా చివర్లో అందరూ ఒక తన్మయత్నంలో ఉంటే ఫ్యాన్స్ ఇలా రావడంతో థియేటర్లో ఉన్న వారికి గూస్ బంప్స్ తెప్పించింది. ఇదే కాకుండా ఈ సినిమాను చూసిన చాలా మంది ఫ్యాన్స్ ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోతున్నారు. అంటే ఈ సినిమా సంస్కృతి మూలాల్లోకి వెళ్లి దాని గొప్పతనాన్ని చెప్పడంలో విజయం సాధించిందనే చెప్పాలి. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన వ్యాన్స్ ఓ థియేటర్లో జరిగిన ఈ సీన్ గూస్ బంప్స్ తెప్పస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read also-KTR: ఆర్టీసీ బస్సు చార్టీల పెంపు దారుణం.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!
రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘కాంతారా చాప్టర్ 1’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగిస్తుంది. రిషబ్ శెట్టి నటించిన ఈ చిత్రం, ముందు రెండు రోజుల్లో గొప్ప ప్రదర్శన చేసిన తర్వాత శనివారం కూడా తన బలమైన రన్‌ను కొనసాగించింది. ఈ చిత్రం ఇప్పుడు భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా మారింది. ‘కాంతారా చాప్టర్ 1’ శుక్రవారం నాటికి భారతదేశంలో ₹107 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. ఇందులో దసరా రోజున రూ.61.85 కోట్లతో బలమైన ఓపెనింగ్, శుక్రవారం రూ.46 కోట్లు ఉన్నాయి. శనివారం కూడా ఈ యాక్షన్ డ్రామా తన ఊపును కొనసాగించింది. ఓ నివేదిక ప్రకారం, శనివారం రూ.53.82 కోట్ల నెట్ వసూళ్లు జోడించుకుని, మూడు రోజుల్లో చిత్రం మొత్తం దేశీయ వసూళ్లు రూ.161.67 కోట్లకు చేరాయి.
Read also-Kantara 1 collection: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘కాంతారా చాప్టర్ 1’ వసూళ్లు.. మూడోరోజు ఎంతంటే..
శుక్రవారం, ఈ చిత్రం సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రంగా మారింది. ‘సు ఫ్రం సో’ (రూ.92 కోట్ల నెట్) లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమించింది. శనివారం, ‘కాంతారా చాప్టర్ 1’ ఈ ఓవర్‌టేకింగ్ స్ట్రీక్‌ను కొనసాగించింది. సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ (రూ.110 కోట్లు), రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ (రూ.131 కోట్లు) వంటి ఇటీవలి పెద్ద సినిమాల లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమించింది. శనివారం రూ.150 కోట్ల మార్క్‌ను దాటి, ఇది నాల్గవ కన్నడ చిత్రంగా మారింది. ‘కాంతారా చాప్టర్ 1’ విదేశాల్లో కూడా అద్భుతంగా ప్రదర్శన చేస్తోంది. మొదటి రెండు రోజుల్లో సుమారు రూ.22 కోట్లు అంతర్జాతీయ వసూలు చేసింది. ఈ ఆదివారం నాటికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లు దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సినిమా విజయంపై పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు తమ అభిప్రాయాలు తెలిపారు.
After the screening of Kantara Chapter 1 at a cinema in Dindigul, a fan dressed as a Daiva stunned the audience there.
Goosebumps
Thank you Divine star @shetty_rishab @hombalefilms for making such a Divine movie #KantaraChapter1 pic.twitter.com/sPd3bNmNHN
— ಸನಾತನ (@sanatan_kannada) October 5, 2025
