KTR (imagecredit:twitter)
తెలంగాణ, హైదరాబాద్

KTR: ఆర్టీసీ బస్సు చార్టీల పెంపు దారుణం.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!

KTR: సిటీ బస్సు చార్జీలను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచి జంట నగరంలో ఉన్నటువంటి పేద మరియు మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వ నిర్ణయాలు దుర్మార్గమైనవని కేటీఆర్(KTR) అన్నారు. ఆర్టీసీ(RTC) పెంచిన చార్జీలపై తను స్పందిస్తు ఎక్స్ వేదికగా కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఓపక్క నిత్యావసర వస్తువుల ధరల పెరిగి ప్రజలు అల్లాడుతున్న తరుణంలో ఇలాంటి నిర్నయం తీసుకోవడవం దారుణం అని అన్నారు. పెంచిన చార్జీలతో పట్టణంలోని ప్రతి ప్రయాణికుడిపై నెలకు 500 రూపాయల అదనపు భారం పడుతందని అన్నారు. ఇలా పెంచండం వలన బడుగుజీవులు ఎలా బతకాలో రాష్ట్ర ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని అన్నారు.

దాదాపు కోటి రూపాయల భారం

ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థుల బస్ చార్జీలు, టీ-24 టిక్కెట్ చార్జీలను పెంచిందని అన్నారు. ఇంక ఇది చాలదన్నట్టు.. ఇప్పుడు కనీస చార్జీపై కనికరం లేకుండా 50 శాతం టిక్కెట్టు ధరలను పెంచడం రేవంత్(Revanth) అసమర్థ పాలన విధానాలకు నిదర్శనం అని దయ్యబట్టారు. రాజధానివాసుల నడ్డివిరిచి ప్రతినిత్యం దాదాపు ఓక కోటి రూపాయల భారం మోపాలని చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్(Hyderabad) ప్రజలపై కక్ష పెంచుకుంటున్నట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో తుస్సుమన్న ఫ్రీ బస్సు(Free Bus) పథకంతో దివాళా తీసిన ఆర్టీసిని ఎలా గట్టెక్కించాలో ఆలోచించకుండా సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడటం దారుణం అని కేటీఆర్ అన్నారు.

ఈనెల 6వ తేదీ నుంచి అమలు..

జంట నగరాల ప్రజలకు ఆర్టీసీ చార్జీలు పెంచింది. అన్నిరకాల ఆర్టీసీ(RTC) బస్సుల్లో టిక్కెట్ రేట్లను పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం జంట నగరాల పరిధిలో నడిచే సిటీ ఆర్డినరీ(Ordinary), మెట్రో ఎక్స్ ప్రెస్(Metro Express), ఈ ఆర్డినరీ(E Ordinary), ఈ ఎక్స్​ ప్రెస్​ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు 5 రూపాయల చొప్పున రేట్లు పెంచనున్నుందని తెలపింది. 4వ స్టేజీ నుంచి 10 రూపాయలను అదనపు ఛార్జీగా వసూలు చేయనుంది. ఇక, మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వసుల్లో మొదటి స్టేజీకి 5 రూపాయలు, రెండో స్టేజీ తరువాత అదనంగా 10 రూపాయలు పెంచనున్నట్టు, ఈనెల 6వ తేదీ నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.

Also Read: Keesara: కీసరలో తమిళ తంబీల లొల్లి.. బైక్ పక్కకు తీయమన్నందుకు రచ్చ

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు